
JEEVANA VAHINI
₹70
In stock · 4 available
PublisherRAVINUTHALA SUVARNA KANNAN
LanguageTelugu
జీవన వాహిని సాయంత్రం అయిదుగంటలు దాటింది. శీతాకాలం కావడాన అప్పుడే చల్లనిగాలి విసురుగా వీస్తూ ఒకలాంటి ఒణుకు పుట్టిస్తోంది. రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండిపోయాయి. అలాంటి సమయంలో హడావిడిగా ఇల్లు చేరాడు శివ. ఇంట్లోకొస్తూనే చేతిలోని బేగ్ మంచం మీదకి విసిరి, పేంట్కి షర్ట్కో వున్న సీక్రెట్ పాకెట్స్లోనించి రకరకాల పర్సులు, డబ్బులు చిన్న చిన్న వస్తువులు తీసి టేబిల్ మీద కుప్పగా పోశాడు. పేంట్ బెల్ట్ దాచుకున్న కత్తెర, బ్లేడు లాంటివి తీసి టేబిల్ క్లాత్కింద పెట్టాడు. ఎప్పటిలా పర్సులో ఎంతుంది. అని చూసుకోలేదు. నిండా వుంటే మురిసిపోయి, కాళీగా వుంటే సదరు పర్స్ యజమానుల్ని తిట్టుకోలేదు. అసలు తన దగ్గర ఎంత సొమ్ము జమయిందో కూడా చూసుకోలేదు. కారణం అతని ధ్యాస ప్రస్తుతం తన సంపాదన మీద గానీ, ఇతర వ్యాపకాల మీదగాని లేదు. అతని ఆలోచనలన్నీ సీత మీదే! ఆమెని చూడాలని అతని ప్రాణం కొట్టుకుపోతోంది. అసలు పదిహేను రోజుల పాటు సీతని చూడకుండా ఈ మధ్య ఎప్పుడూ లేడు. సీతని చూడక పోవడంలో ఇంత నరకం వుంటుందని కూడా అతనికి తెలియదు.