
JEEVANA VIDYA
₹25
In stock · 1 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
ముందుమాట... 1956లో అంశత్రయ కార్యక్రమము, ప్రచార ఆర్భాటములు లేకుండా, నిరాడంబరముగా మొదలైనది. ఒక సంస్థగా లేక పార్టీగా ఏర్పరచే ఉద్దేశ్యము ఉండలేదు. వైదిక సంప్రదాయము, ధర్మాచరణ నానాటికి తగ్గిపోతూ ఉండటం, ఆందోళన కలిగించేటట్లుగా ఉండెను. దీనికి సమాధానంగా ధర్మాన్ని నమ్మిన సామాన్య వ్యక్తి ఉడతా భక్తిగా ఏదైనా చేయాలి. మూల కూర్చొనుట మంచిది కాదు. "ఆచారః ప్రథమో ధర్మః" అన్నారు. ధర్మానికి నీతి ఆచరణయే కదా! సంధ్యావందనము, నిత్య కర్మానుష్ఠానము, ధర్మాచరణకు కనీస కార్యక్రమము. ఇది బ్రాహ్మణులకు వర్తించును. గృహిణులకు, మిగతా ధర్మాభిమానులందరికీ పూజా పునస్కారములు చెప్పబడినవి. ఇది ఇంటి పవిత్రతకు, కుటుంబ పవిత్రతకు దోహదకారి. ఇది మొదటి అంశము. రెండవ అంశము దేవాలయ దర్శనము, భగవన్నామస్మరణ. ప్రపంచములో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎంత ఘనుడైన మనిషైనా, పనిచేయుటకు అవకాశమున్నదే కాని ఫలితము అతని చేతిలో లేదు. అది భగవదధీనమని ధర్మాభిమానుల నమ్మకము. దేవునికి శరణు వెళ్ళుట, దైవ విధానానికి లోబడి దానిని అనుసరించుట, ఆయనను దర్శించుట, మరియు వేడుకొనుటకు గాను, దేవాలయ దర్శనము చెప్పబడినది. కలికాలంలో ఒక పాదం ధర్మము, మూడు పాదములు అధర్మమగుట చేతనూ, ధర్మాచరణ సామాన్య ప్రజలకు కష్టసాధ్యమగుట చేతనూ, భగవన్నామ స్మరణ చెప్పబడినది. "కలౌస్మరణాన్ముక్తిః" ఇక మూడవ అంశము సమష్టి ఇది అతి ముఖ్యమైనది. 7-8 శతాబ్దాల పరాయ ఆక్రమణ పర్యవసానంగా సనాతనుల్లో సమష్టి భావన సన్నగిల్లుతూ వచ్చింది. 'ఎవరికి వారే యమునా తీరే' అన్న దురవస్థ దాపురించింది. ఇంకనూ దీనిని సహించుట ఆత్మ ఘాతమే అవుతుంది. మనము సంఘజీవులమని తెలిసి కూడ ఒంటరితనమును ఎంచుకొనుట, అనగా నేను, నా పిల్లలు బాగుంటే చాలు. దేశము- సమాజము నాకు అనవసరము అనే భావన కానవస్తున్నది. కలసి వుంటే కలదు మేలు- ఒంటరి అయితే తప్పదు కష్టం. పిలిస్తే పలికే దిక్కు, ఇరుగు-పొరుగు, మాట-మంచి, ఆత్మీయత-అన్యోన్యత, మంచితనము-మంచివాళ్ళ బలము. ఇవి గృహస్థులకు అవసరము కదా! "సొంతలాభము కొంత మానుకొని పొరుగువానికి సాయపడవోయ్", "దేశమంటే మట్టికాదోయ్- దేశమంటే మనుషులోయ్". ఇది నవ భారతానికి నాందీ వాక్యము. "విష్ణోర్బలం వర్ధతామ్" ఇదే మన ఏకైక ఆకాంక్ష.