
JEEVANADI - 200
by JANNABHATLA NARASIMHA PRASAD
₹200
In stock · 5 available
PublisherJANNABHATLA NARASIMHA PRASAD
LanguageTelugu
నా మాట మానవ జీవితానికి కథకు విడదీయరాని సంబంధం ఉన్నది. కథ మనిషంత పాతదే కాదు. మనిషంత కొత్తది కూడా. మన ఇతిహాసాలన్నీ కథా సమాహారాలే. ప్రస్తుతం సమాజంలో నకారాత్మక (నెగటివ్) ధోరణి పెరిగిపోతున్నది. ఈ విపరీత ధృక్పథాన్ని ఎదుర్కొని సమాజంపట్ల బాధ్యత, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర మీద అవగాహన, కుటుంబం, రక్త సంబంధీకుల పట్ల ప్రేమ అభిమానాలు, పెద్దల ఎడల గౌరవాలు ప్రతిబింబించే విధంగా కథా వస్తువులు, వాస్తవాలు తెలియపరిచే కథలు నేటి తరానికి ఎంతో అవసరం. ఈ కథాసాహిత్య మహాక్రతువులో నా వంతు విధిగా ఈ కథలు, నాటిక సంపుటి 'జీవనది' అనే గ్రంథాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఇదినా 12వ రచనా గ్రంథము. నా కోరికను మన్నించి ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం ఎంతో ఓపికగా చదివి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియపరచిన డా॥ అక్కిరాజు రమాపతిరావు. ప్రొ॥ ముదిగొండ శివప్రసాద్ మరియు శ్రీ సోమయాజుల చంద్రమౌణేశ్వరావు గార్లకు నా హృదయపూర్వక ధన్యవాదములు నా అభ్యర్ధనను ఆమోదించి ఈ గ్రంథాన్ని స్వీకరించటానికి అంగీకరించి, ఆర్థిక సహాయం చేసిన శ్రీ గుదిబండి వెంకటరెడ్డి మరియు శ్రీ వి.వి. రాఘవరెడ్డి గార్లకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. కరోనా కష్టకాలంలో నా రచనా వ్యాసంగానికి తన వంతు కృషిని అందించిన నా అర్ధాంగి శ్రీమతి లక్ష్మీకామేశ్వరి, సంగీత గురువు కర్నాటక (గాత్రం) మరియు నా కుమారుడు ఉగ్రనరసింహ సాయిపవన్కు నా ఆశీస్సులు. డి.టి.పి. ఎంతో శ్రద్ధతో చేసి ముద్రించి సకాలములో అందించిన పి. భాస్కర్, ప్రసన్న ఆర్ట్ ప్రింటర్స్ ఇ.సి.ఐ.యల్., హైదరాబాదు వారికి ధన్యవాదములు.