JEEVANAGAANAM KATHA SAMPUTI by DR.MAJJI BHARATHI Telugu book cover

JEEVANAGAANAM KATHA SAMPUTI

by DR.MAJJI BHARATHI

₹150
In stock · 90 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126979
JEEVANAGAANAM by Dr. Majji Bharathi 'జీవనగానం'లో... ఈ కథా సంపుటిలో, మానవ సంబంధాల గురించి, జీవితంలో మనం నిత్యమూ ఎదుర్కొనే మానసిక సంఘర్షణల గురించి విశ్లేషణాత్మకంగా వివరిస్తూనే, ఆచరణాత్మకమైన పరిష్కారాలను సూచించారు రచయిత్రి ప్రొఫెసర్ (డాక్టర్) మజ్జి భారతి. వైద్య వృత్తిలోని తన అనుభవాలను జోడిస్తూ, మనస్తత్వాలను విశ్లేషిస్తూ, మనచుట్టూ జరిగిన సంఘటనలనే కథలుగా మలిచి, మనకందించారు. సానుకూల దృక్పథంతో, జీవితాలనెలా ముందుకు నడిపించుకోవచ్చో ఈ కథలు మనకు తెలియజేస్తాయి. మానవ సేవయే మాధవ సేవ అని త్రికరణశుద్ధిగా నమ్ముతాయి ఈ కథలలోని పాత్రలు. అంతేకాదు చదివే పాఠకులను కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తాయి. అత్తాకోడళ్ళ మధ్య, గురుశిష్యుల మధ్య, సంబంధాలెలా ఉంటే హృద్యంగా ఉంటుందో చక్కగా వివరించారు కొన్ని కథలలో. కథలలోని పాత్రలన్నీ సామాన్యంగా ఉంటూనే, నమ్మిన ఆశయాలను ఆచరిస్తుంటాయి. ఉద్యోగం చేస్తూ, గృహ నిర్వాహణ చేస్తున్న మహిళలపట్ల, కుటుంబ సభ్యుల దృక్పథం మారాలని, ప్రతినెలా స్త్రీలు ఎదుర్కుంటున్న సమస్య గురించి, వారి మనోభావాలెలా ఉంటాయి, సమాజం వారి కెటువంటి మద్దతు ఇవ్వాలనే విషయాలను సున్నితంగా స్మృశించారు. పిల్లల చదువులలో, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల బాధ్యతను, జంక్ఫుడ్ను పిల్లలకందించి వారి అనారోగ్యానికి పరోక్షంగా కారణమవుతున్న తల్లిదండ్రుల పట్ల తన అభిప్రాయాలను నిష్కర్షగా చెప్పారు మెడికల్ కాలేజీలో ప్రొఫెసరుగా పనిచేస్తున్న రచయిత్రి. ఇందులోని ప్రతికథా మనం ఆసాంతం చదివేలా చేసి, తీయని అనుభూతులను మనకందిస్తాయంటే అది అతిశయోక్తి కాదు. మరెందుకాలస్యం? ఈ కథల 'జీవనగానాన్ని' ఆస్వాదిద్దాం రండి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-48126-97-9