
JEEVANAVAHINI KATHALA SAMPUTI
₹120
In stock · 6 available
PublisherMATHA PRACHURANALU
LanguageTelugu
ముందుకు సాగే ముందు... నా మాట... జీవన ప్రవాహంలో ఎదురయ్యే అడ్డంకులను తప్పించుకుంటూ, జీవితనావలో సాగిపోయే మానవచిత్రాల సమాహారమే ఈ 'జీవనవాహిని'. రచనా వ్యాసంగాన్ని నా కత్యంత ప్రియమైన ప్రవృత్తిగా ఎంచుకుని పది సంవత్సరాలు దాటిపోయింది. కానీ... ఒక 'నిమేషమాత్రమే' నన్నట్లుగా ఉంది. ఎన్నో అనుభవాలు... ఎన్నెన్నో పరిచయాలు. ప్రముఖులతో చర్చలు... ఎంతో విషయ సముపార్జన... ప్రతి రోజూ కొత్త విశేషాలు తెలుసుకోవడమే... నిత్యనూతనమే. నిజం చెప్పాలంటే నా ముప్పై ఐదేళ్ళ అధ్యాపక వృత్తిలో కంటే ఎక్కువ లోకజ్ఞానాన్ని సంపాదించుకున్నాను. నా మొదటి కథాసంకలనం 'అనంతవాహిని'కీ రెండవ కథాసంపుటి 'జీవనవాహిని'కీ మధ్య నాలుగు సంవత్సరాల విరామం. ఆ రెంటి నడుమా రెండు నవలలు ప్రచురించాము. నా రచనల్లో కొన్నింటినయినా భద్రపరచాలనే సంకల్పంతో ప్రచురణలు ప్రారంభించాము. నా రచనలనీ, పుస్తకాలనీ ఆదరిస్తున్న పాఠకులకు, బంధుమిత్రులకు అనేక వందనాలు. 'జీవనవాహిని'లో అధికంగా స్త్రీలు, వారి సమస్యలే కథావస్తువులయ్యాయి. ఆధునిక సమాజంలో స్త్రీల పాత్ర, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి నిస్సహాయతలు, ఆవేశాలు, పరిష్కారమార్గాలు, 'అమ్మ'గా స్త్రీ భావాలు కొన్ని కథల్లో విశ్లేషించడానికి ప్రయత్నం చేశాను. ఈ పుస్తకం అచ్చులో రావడానికి శ్రీమతి జ్యోతివలబోజు ప్రోత్సాహం వెలకట్టలేనిది. ఈ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దిన రూపశిల్పి వారే! శ్రీమతి జ్యోతికి, ప్రచురించిన జె.వి. పబ్లిషర్స్ వారికీ, డిటిపి చేసిన రవిప్రభగారికి నా కృతజ్ఞతలు.