
JEEVANI - SAHITYA VIMARSHA VYASA SAMPUTI
₹200
In stock · 46 available
PublisherDR.P.SANJEEVAMMA
LanguageTelugu
మార్క్సిస్టు సాహిత్య విమర్శకు నమూనా వ్యాసాలు "కళకు, సాహిత్యానికీ సామాజిక ప్రయోజనం ఉండితీరాలన్న ప్రతిపాదనను ముందుకు తీసుకురావడమే గాకుండా, అలా కాకపోతే ఆ సాహిత్యం నిస్సారం అనీ, ప్రపంచ సాహిత్యం అంతా అది ఏనాటిదైనా ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించే సృజింపబడిందనే వాస్తవాన్ని నిరూపించింది అరసం." (డా. పి. సంజీవమ్మ: జీవని సాహిత్య విమర్శ వ్యాస సంపుటి, పు 142) ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ చరిత్రలో అభ్యుదయ సాహిత్య విమర్శ ఒక సుదీర్ఘమైన అధ్యాయం. ఈ అధ్యాయాన్ని విస్మరించి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శను అధ్యయనం చేయడం అసాధ్యం. తెలుగు అభ్యుదయ సాహిత్యానికి ఎంత చరిత్ర ఉందో, ఆ సాహిత్య విమర్శకూ అంత చరిత్ర ఉంది. ప్రతి కొత్త సాహిత్య ఉద్యమమూ తనను తాను నిర్వచించుకొని బయలుదేరుతుంది. అలాగే అభ్యుదయ సాహిత్యం మొదలైంది. అభ్యుదయ సాహిత్య విమర్శ కూడా మొదలైంది. తెలుగు అభ్యుదయ సాహిత్య విమర్శకు ఎనిమిది దశాబ్దాలకు మించిన చరిత్ర ఉంది. అభ్యుదయ సాహిత్య విమర్శ ఒకవైపు కొత్తకొత్తగా వస్తున్న సాహిత్యాన్ని విశ్లేషిస్తూ, మరోవైపు పూర్వ సాహిత్యాన్ని పునర్విశ్లేషణ చేస్తూ వస్తున్నది. రాటకొండ నరసింహారెడ్డి, శ్రీశ్రీ, కొ.కు, మద్దుకూరి చంద్రశేఖర రావు వంటి వాళ్ళు వేసిన ఆరోగ్యకరమైన పునాదులమీద తెలుగు అభ్యుదయ సాహిత్య విమర్శ క్రమంగా ముందుకు సాగుతూ, సమకాలీన ప్రజాతంత్ర విమర్శ ధోరణులను సమన్వయం చేసుకుంటూ ప్రయాణిస్తున్నది