
JEEVAPHALAM CHEDUVISHAM
₹65
In stock · 13 available
PublisherPENNETI PUBLICATIONS
LanguageTelugu
ఈ కథల నిండా భూమి దుఃఖం కనిపిస్తుంది. వ్యవసాయదారుని నిస్సహాయత కనిపిస్తుంది. తరతరాల దోపిడికి గురవుతోన్న మట్టిమనిషి దీనత్వం కనిపిస్తుంది. వీటన్నిటికీ కారణాల్ని వెదకటంలో, పరిష్కారాల్ని సూచిం చటంలో సింగమనేని గారి అవగాహన మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆయన వ్యక్తీకరించిన భావాలు పరిశోధకుల్ని సైతం ఆలోచింపజేస్తాయి. ఈ కథల్లో ఎక్కడా అనవసరంగా ఒక్క వాక్యం కవితాత్మకం కాలేదు. ఒక్క పేరా అదనంగా వచ్చి కూచోలేదు. కొసమెరుపులో, నడుమ ఉరుములో పాఠకుల కోసం చేర్చబడలేదు. ఆయన శైలి నిరాడంబరం. ఆయన వచనం నిరలంకారం. ఆయన కథంతా చదివితే రాయలసీమ మెట్టనేలల మీద నడచినంత సహజంగా ఉంటుంది. ఆయన వాక్యం ఇక్కడి రైతు నడకలా వుంటుంది. నేలను దున్నుకొంటూ పోతోన్న నాగలిలా వుంటుంది... - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి