JEEVARASAYANA VAIDYA VIDHANAMU by DR.VEPAKOMMA RADHAKRISHNAMURTHY Telugu book cover

JEEVARASAYANA VAIDYA VIDHANAMU

by DR.VEPAKOMMA RADHAKRISHNAMURTHY

₹150
In stock · 4 available
PublisherDR.VEPAKOMMA RADHAKRISHNAMURTHY
LanguageTelugu
1. ఉపోద్ఘాతము మానవులు ప్రపంచం మీద అవతరించినప్పటి నుంచి తమకు కల్గిన బాధలను పాకొట్టుకొనుటకై ఎన్నో విధాలైన వైద్యములు చేయుచుండినారు. అనాదిగ చెట్టు బెరడులు, ఆకులు, వ్రేళ్లు వైద్యానికుపయోగించేవారు. ఈ మూలికా వైద్యం వ్యక్తిగత అనుభవాలమీద తెలుసుకొన్నది. అందుచేత వారు తమ అనుభవ విజ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టేవారు కారు. వైద్యాన్ని గోప్యంగా వుంచేవారు. కాలక్రమేణ మానవుని బుద్ధికుశలత వృద్ధి అయ్యేకొద్ది వైద్య విజ్ఞానం కూడ వృద్ధిపొందసాగింది. జబ్బులు వచ్చుటకు కారణాలు కూడ తెలుసుకొనవలననే వుత్సాహం మానవులలో పెరిగింది. ఇదే కొన్ని వైద్య సిద్ధాంతాలు నిర్వచించుటకు దోహదకారియైనది. సిద్ధాంతాల ద్వారా వైద్యజ్ఞానం నల్గురికి అందచేయడము జరిగింది. కొన్ని వైద్య పద్ధతులను అనాదిగ కల్గినబడిన సిద్ధాంతాలు మార్పు చెందకుండ అన్ని కాలాలకు ఉపయోగపడుచున్నవి. ఉదా: ఆయుర్వేద త్రిదోష సిద్ధాంతము. ఇది కొన్ని వేల సంవత్సరాల నుండి మార్పులేకుండ వాడబడుచున్నది. కాని పాశ్చాత్య వైద్య సిద్ధాంతాలు అలాకాదు. కాలానుగుణంగ అని మార్పులు చెందుచున్నవి. ఒకప్పుడు మానవునిలో జబ్బులు వచ్చుటకు శరీరంలోని రక్తం చెడిపోవుటే కారణమని నమ్మేవారు. జలగల నుపయోగించి, శరీరంలో కోతలు పెట్టి రక్తాన్ని తీసివేయుట ఆకాలపు వైద్యము. శరీరంలో కొన్ని పదార్థాలు లోపించినందువలన జబ్బులు వస్తాయనే సిద్ధాంతం తర్వాత వచ్చింది. లోపించిన పదార్థాన్ని మందుల ద్వార రోగికి సరఫరా చేయుటే వైద్యము. ఉదా: స్కర్వీ వ్యాధి వచ్చినవారికి C విటమిన్ ఇచ్చుట. ఈ సిద్ధాంతము అన్ని జబ్బులకు వుపయోగించనందువలన, కొన్ని జబ్బులున్న వారి రక్తంలో ప్రత్యేక సూక్ష్మ క్రిములు కన్పించినందువలన, క్రిమి సిద్ధాంతము రూపొందించబడింది. క్రిములే రోగ కారకములని వాటిని నశింపజేసిన ఆరోగ్యం కల్గునని నమ్మేవారు. ఈ క్రిములు (Bacteria & Virus) కంటికి కన్పించవు.