JEEVINCHI UNDAGANE JEEVANMUKTI ANANDAM by SADGURU SRI RAMESH JAIN Telugu book cover

JEEVINCHI UNDAGANE JEEVANMUKTI ANANDAM

by SADGURU SRI RAMESH JAIN

₹150
In stock · 92 available
PublisherSADGURU SRI RAMESH JAIN
LanguageTelugu
సద్గురు శ్రీ రమేష్ గారు 1957 సంవత్సరములో భారతదేశములో జైన్ పరివారములో జన్మించారు. ఆయన పుట్టినప్పటి నుండి మత పారంపరిక విషయాలలో విభిన్న అభిప్రాయం వ్యక్తం చేసేవారు. కాలక్రమేణ ఆయన అన్ని మతాల సారము ఒక్కటేనని గుర్తించి ఆ నిరాకారుడైన, నిరంజనుడైన పరమాత్మను సృష్టిలో సర్వత్ర దర్శించుకోగలగడం గొప్ప విశేషం. ఆయన తన విద్యాభ్యాసానంతరం, గొప్ప పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. తర్వాత స్వామి పూర్ణానంద వారి ఆశీర్వాదములతో ఆయన ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి, అభిరుచి చూపి జీవన మరణ చక్రంలో చిక్కి పోకుండా పరమపదం పొందడానికై కృషి చేసి చివరికి బ్రహ్మజ్ఞాని అనిపించుకున్నారు. ఆయనకు శ్రీ రాజేంద్ర బ్రహ్మచారి అనే యోగీశ్వరుని సాన్నిహిత్యం లభించింది. ఆయన పర్యవేక్షణలో ఎన్నో యోగాసనాలు, ప్రాణయామం, యోగక్రియలు హఠయోగ, రాజయోగ మొదలైన వాటిలో తనకుతానే సాటిగా నిరూపించుకున్నారు. జీవిత కాలంలోనే జీవన్ముక్తి పొందడం అనే విషయంపై తన గురువుగారి కృపావిశేషంతో ఆయన బ్రహ్మానందస్థితిని స్వయంగా పొంది, అనుభవైక వేద్యమైన, మాటలకతీతమైన అనుభూతిని, దివ్య అనుభవాలకు భావానికి అనుగుణమైన విధంగా ఆయన దివ్యానుభూతిని పొందారు. ఎవరైనా సరే సద్గురుకృప, నిరంతర సాధనాల ద్వారా జ్ఞానం లభిస్తుందని ఈ ప్రపంచంలో జీవిస్తూ, కర్తవ్య కర్మల నాచరిస్తు తాను తన భక్తి వ్యక్తి, భావన నుండి 'బ్రహ్మభావన' లోకి రావలసి ఉంటుందని చాటిచెప్పారు. ఆయన ఆధ్యాత్మిక రచనలు సామాన్య మానవుల మనుగడకై ప్రతీకలుగా గుర్తింపబడ్డాయి.