
JEEVINCHU NERCHUKO ANDINCHU
₹75
In stock · 11 available
PublisherTHUMMETI RAGHOTHAMA REDDY
LanguageTelugu
ముందు మాట ఇంటర్నెట్లో ఒక్కోసారి లభ్యమయ్యే కొన్ని పిపిటి, పిడిఎఫ్ ప్రజెంటేషన్లు చూసినప్పుడు, అదొక కొత్త సాహితీ ప్రక్రియగా అనిపిస్తుంది. వేళ్ళ మీద లెక్కించగలిగే స్లయిడ్లలోనే, ఒక కథ ద్వారా సాధించగలిగే సాహితీ ప్రయోజనాన్ని అవి ఇవ్వగలు గుతున్నాయి. మనకు మరపుల్లోనో మరుగులోనో పడ్డ విషయాలను కొన్ని వాక్యాలు, కొన్ని ఫోటో గ్రాపుల ద్వారా గుర్తుకుతెచ్చి, ఆలోచనలలో పడవేయ గలుగుతున్నాయి. ప్రస్తుత సాంకేతిక అభివృద్ధి, ప్రజానీకానికి దాని అందు బాటు, కొత్తరం యొక్క మారిన జీవనశైలి నేపద్యంలో, కథ లేదా సాహిత్యానికి సంబంధించి కొన్ని కొత్త నిర్వచనాలు అవసరమవుతాయి. ప్రస్తుతం అతి పెద్ద మీడియంగా మారిన ఇంటర్నెట్ లో ఇంగ్లీషు భాషకు, గ్రామరుకు సంబంధించి పెనుమార్పులను మనం గమనించవచ్చు. సంభాషణల్లో, భావ వ్యక్తీకరణల్లో క్లుప్తత యొక్క ప్రాధాన్యత రోజు రోజుకీ పెరుగుతున్నది. ఇటీవలి కాలంలో ఇంగ్లీషు భాషలో కొటేషన్లతో పుస్తకాలు వెలువడుతున్నాయి. సెలెక్టడ్ కోట్స్ గానో లేదా ఏదైనా రచయితకు సంబంధించిన కోట్స్ గానో ఇంతకు పూర్వం కూడా వచ్చేవి. ప్రస్తుతం అనేక మందికి అనేక వయసులవారికి చెందిన, వారి వారి అనుభవాలను, అండర్ స్టాండింగిని ఒకటి లేదా రెండు వాక్యాలుగా ఒకో వాల్యూముగా వేయబడుతున్నాయి. ఈ పుస్తకాలకు గిరాకి కూడా హెచ్చుగానే ఉంది. దూరప్రయాణాల్లోనూ, బెడ్ టైము రీడింగు బుక్ గానూ, యువతరపు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలతో పాటు ఈ కొత్త తరహా (ప్రత్యేక జానర్ ) పుస్తకాలను ఆదరిస్తున్నారు. వీటిలో ఉన్న సౌలభ్యం, ఏ వాక్యానికి అదే ప్రత్యేకం. ఏ పేజీ ఐనా తెరిచి ఎక్కడైన మొదలు పెట్టవచ్చు. ఆపవచ్చు. ఈ ఆదరణకు కొత్త తరం నూతన జీనవ శైలిలోని క్లుప్తత పట్ల మక్కువకూ సంబంధం ఉన్నట్టుంది. ఈ తరహా పుస్తకాల అవసరం తెలుగులో కూడా వుంది.