
JEEVITAARDHAM NATAKAM
₹50
In stock · 16 available
PublisherKAVURI SATYANARAYANA
LanguageTelugu
రచయిత మాట నేను వ్రాసిన నాటిక లేదా నాటకం ప్రేక్షకాదరణ పొందనప్పుడు వాటి ప్రదర్శనని ఆపివేస్తాను. రచయిత ఆత్మతృప్తి కోసం నాటకం రాయకూడదు. జన తృప్తి కోసం 'రాయాలి. సామాజిక అసంతృప్తులను, అసమానతలను, రుగ్మతలను పరిశీలించి, విశ్లేషించి చేసే రచనలు కలకాలం మనగలుగుతాయి. అదృష్టవశాత్తు నా రచనలు ఆ కోవలోకి వచ్చాయి. కుటుంబ విలువలను సూచిస్తూ జారుడు మెట్లు, ముఖచిత్రం, గుణపాఠం, కొంచెం సర్దుకో ఇలా ప్రతి సబ్జెక్ట్ వెనుక బహిరంగంగా ఒక సామాజిక రుగ్మతను ప్రశ్నించే విధానంతో నా రచనలు ఇప్పటి వరకు సాగాయి. నా నాటికలు, నాటకాలు ఆంధ్ర ప్రజల మన్ననలను అందుకొనుట రచయితగా నేను ధన్యుడ్ని. ఈ జీవితార్ధం నాటకంలో ఒక సజీవశిల్పం ఉంది, వేదన ఉంది, ప్రేమ ఉంది, ఆక్రోశం ఉంది. క్షీణించిపోతున్న కుటుంబ విలువల్ని తిరిగి నిలబెట్టాలనే ఆకాంక్షతో రాస్తే సహృదయ ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఒక సినిమాని మించి, ఒక టివిని మించి ఆంధ్ర ప్రేక్షకులు ఈ నాటకాన్ని చూసి సజల నేత్రాలతో నటీనటుల్ని అక్కున చేర్చుకున్న సన్నివేశం ఎక్కడ కానవస్తుంది. ఒక్క రంగస్థలం మీద తప్ప. ఆ అదృష్టం జీవితార్ధం నాటకంది. ఈ నాటక ప్రదర్శన ద్వారా ఏ మాత్రం ఆదాయం రాకపోవచ్చు. కాని కోట్ల విలువైన హర్షద్వానాలు, కరస్పర్శలు, ఆలింగనాలు, అవార్డులు అందుకొనుట కంటే కావాల్సినది ఏముంటుంది. అందుకనే నాటకానికి కావల్సింది ఉత్తమ ప్రేక్షకులు. జీవితార్ధం చూసి “ముందు మాట” రాసిన కళార్ద్ర హృదయులందరికి నా వందనాలు.