
JEEVITHA VIJAYA RAHASYAM
₹50
In stock · 3 available
PublisherMARRI KRISHNA REDDY
LanguageTelugu
విద్యార్థి జీవిత విజయరహస్యం ప్రథమాధ్యాయం ప్రవేశిక నేడు మనదేశానికి బలిష్ఠులైన యువకులవసరం. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసేవారూ, హృదయంలో ఉరకలువేసే దేశభక్తిని కల్గినవారూ నేడు మనకు కావాలి. సదాచారులూ, చరిత్రవంతులూ, సంయములూ, "జితేంద్రియులూ, మేధావులూ, ఆత్మ వంతులూ అయినట్టి యువజనం నేడు అత్యవసరం. వివేకానందుని మాటల్లో - "నేడు మనదేశానికి ఇనుప కండరాలూ, ఉక్కునరాలూ కట్టిన యువకులు కావాలి. ఎవరూ అడ్డుకోలేనట్టి దుర్భేధ్యమైన దృఢచ్ఛుకులు కావాలి. ఈ బ్రహ్మండంలోని సమస్త రహస్యాలనూ ఛేదించే శక్తికలవారు కావాలి..... నేను నేది బలం. పురుషార్థం, క్షేత్రం, బ్రహ్మతేజం మాత్రమే!" దేశంలోని యువతీయువకులు బలవంతులూ, మేధావులూ కావడం కోసం ఈ పుస్తకంలో ప్రాతఃజాగరణం మొదల్కొని నిద్రించుదాకా విద్యార్థుల పూర్తి దినచర్య పొందుపరచబడినది. ఈ దినచర్యను పాటించువారు శతాధికంగా జీవించి దృఢశరీరంతో అదేనులై జీవితాన్ని సఫలం చేసికొంటారు. ప్రపంచంలో మానవుడు పురుషార్థంద్వారా ఉన్నతిని పొందడానికి జన్మించాడు. ఈ జగతిలో ప్రతివస్తువులోనూ గతి-చేతనత ఉంది. భూమి, సూర్యచంద్రాది గ్రహాలు చలిస్తూనే ఉన్నాయి. అలాగే నక్షత్రాలేగాక ప్రతివస్తువూ చలిస్తూనే ఉంది. వీటిలో మహద్వస్తువైన సూర్యుడు గతిలో ఉన్నందువల్ల అతిసూక్ష్మమైన (Atom) పరమాణువు కూడా విద్యుత్కణము (Electron) లలోని కేంద్రంలో నలువైపులా పరిభ్రమిస్తోందని తెలుస్తోంది. అందువల్ల సూర్యమండలం ఓ విలక్షణమైన ఉదాహరణం.