JEEVITHA VIJAYANIKI 7 MAHIMAANIVTA SUTHRALU by DR.HEMA LATHA Telugu book cover

JEEVITHA VIJAYANIKI 7 MAHIMAANIVTA SUTHRALU

by DR.HEMA LATHA

₹34
In stock · 8 available
PublisherDR.HEMA LATHA
LanguageTelugu
జీవిత విజయానికి మహిమాన్విత సూత్రాలు నిరంతరం ఆనందాన్ని. అమృతంలా వ్యాపింపచేస్తూ, యోగ్యమైన జీవిత ధ్యేయాల గమ్యాన్ని చేరుకుంటూ," నానాటికి పురోభివృద్ధి చెందడమే' విజయానికి చిహ్నం ! ప్రయాస లేకుండా విజయసంకేతాన్ని ఎగురవేయడమే కోర్కెల సఫలీకరణకు మూల చిహ్నం ! ఎటువంటి కార్యసిద్ధికయినా, అతిసహజంగా, ప్రయాపలేని సఫలీకరణ సిద్ధించాలంటే, ఆధ్యాత్మిక పరమైన సమన్వయం అవసరం! విశ్వమంతా పంచభూతాల మయం. పంచభూతాలు ప్రాణశక్తితో కూడి .'' వున్నాయి. ఎందుకంటే ప్రాణము లేక పంచభూతములకు, కదలికలేదు.. విశ్వంలో ఏవిధంగానయితే పంచభూతాలున్నాయో, మన శరీరంలో కూడా 'అవే పంచభూతములున్నాయి. ఈ పంచభూతములను నడిపించే ప్రాణశక్తి మనలో కూడా ఉంది. కాబట్టి మానవుడు విశ్వానికి ప్రతిరూపం! ప్రకృతి నిర్వర్తించే కార్యాలను అవగాహనతో పరిశీలిస్తే, ప్రయాసలేని ప్రయత్నం కన్పిస్తుంది. గడ్డి పెరగటానికి ప్రయత్నించదు, తనంతతానుగా అతి సహజంగా పెరుగుతుంది. చేపలు ఈదటానికి ప్రయత్నించవు, తమంత-తాముగా ఈదులాడతాయి. పక్షులు ఎగరాలని ప్రయత్నించవు, వాటి స్వభావరీతిగా, "స్వేచ్ఛగా ఎగురుతాయి. ఇవన్నీకూడా వాటి స్వాభావికమైన, స్వతఃస్సిద్ధమైన శక్తులు! అలాగే, మానవుడు తన "మధుర స్వప్నాలను, వాస్తవికతగా నిజం చేసుకోవాలనుకోవడం కూడా అతని ప్రకృతి నైజం ! .ఈ భౌతిక ప్రపంచంలో సృష్టింపబడే ప్రతివస్తువు కూడా ప్రకృతి అనుసరించే. కొన్ని మూల సూత్రముల ఆధారంగా పరివర్తన చెందుతుంది. ప్రకృతిలో జరిగే సహజమైన, క్రమమైన, పరివర్తన పద్ధతులను అనుసరిస్తూ, ఆ సూత్రాలను మన జీవితానికి సమన్వయపరుస్తూ, ప్రకృతి వివేకానికి మన ఆత్మజ్ఞానాన్ని జోడిస్తే, ప్రతి యత్నంలో, ప్రయాసలేని విజయపతాకం తధ్యం సుమా !