JEEVITHADARSHAM - CHALAM SAHITYAM NAVALALU by GUDIPATI CHALAM Telugu book cover

JEEVITHADARSHAM - CHALAM SAHITYAM NAVALALU

by GUDIPATI CHALAM

₹110
In stock · 46 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
చలం “తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలం ది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణానుభూతాంతరాలను రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు విస్తృతంగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, మేలుకొలిపే ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కన్నుమూశారు. ✦ ✦ ✦ జీవితాదర్శం చలంగారి చివరి నవల. 1938 తర్వాత 48 సంవత్సరాల వరకు నవల రాయలేదు. ఈ వ్యవధి కాలంలో చాలా పెద్ద ప్రయాణమే చేశారు. జీవితానికి కావలసిందేమిటి అన్న ప్రశ్నకు సమాధానాన్ని వెదికినట్లు ఈ నవలలో తెలుస్తుంది. ఈ నవల రచన నాటికి చలం చేసిన ఒక ప్రయాణం పూర్తి అయింది. స్త్రీ–పురుషుల స్వభావాల మధ్య, భిన్న అంతరాల మధ్య, వైవిధ్యాలు తారసిల్లుకుంటూ ఒక సమన్వయాన్ని ప్రతిపాదించే ప్రయత్నం ఈ నవలలో కనిపిస్తుంది. చలంగారు దర్శించిన పూర్తి పురుషుడు దేశికాచారి. స్త్రీకి స్వేచ్ఛను, ప్రశాంతతను, అనుభవాన్ని ఇచ్చే తనను పరిచయం చేసుకుంటాడు. “జీవితాదర్శం నవలలో కళాత్మకత లేదు కాని, చలం ఏ వైరాగ్య దృక్పథాన్ని చేరుకున్నాడో తెలియచెప్పే రచన. ఆయనలోని స్వేచ్ఛా లాలస చివరకు శాంతితో నిండిన జ్ఞానాన్ని పొందుకున్నాయి. ఆ శాంతి కోసమే ఆయన రమణాశ్రమం చేరారు. ఇక్కడికి మూడవ దశ పూర్తి అయింది.” – ఆర్. ఎస్. సుదర్శనం