JEEVITHAM AATU POTLU by JOSHYABHATLA SATYANARAYANA Telugu book cover

JEEVITHAM AATU POTLU

by JOSHYABHATLA SATYANARAYANA

₹40
In stock · 6 available
PublisherJOSHYABHATLA SATYANARAYANA
LanguageTelugu
ముందుమాట నా గతజీవిత వివరాలను అప్పుడప్పుడు వింటున్న మిత్రుల ప్రోత్సాహంతో, యీ పుస్తకం వ్రాయ పూనుకున్నాను. నాకూ జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు కూడా అనిపిస్తోంది. అందువల్ల ఎందుకైనా మంచిదని నాకుజ్ఞాపకం ఉన్నంత వరకు పొందుపరచాను. జరిగిన ఘటనలు, అలాగే పేర్కొన్నాను గాని వివరాలలోనికి పోలేదు. వివరాలలోనికి పోతే మొత్తం వెయ్యి పేజీల గ్రంథం అవుతుంది. అది యీ దశలో నా శక్తికి మించినపని. నేను రచయితను కాను. అందువల్ల నా భాషగాని, రచన తీరుగాని సక్రమంగా వుండకపోవచ్చు. దోషాలుండవచ్చు. వాటికి మన్ననార్పుణ్ణి. నేను పేర్కొన్న విషయాలలో కొన్ని నాతోబాటు మా కుటుంబంలోని వ్యక్తులకు, అలాగే పార్టీలోని వ్యక్తులకు సంబంధించి వున్నాయి. అవి ఎవరినీ కించపరచడానికో లేక పొగడడానికో ఉద్దేశించినవి కావు. ఎవరికైనా బాధ కలిగించేవిగా వుంటే క్షమార్పుణ్ణి. ఎక్కడైనా పొరపాట్లు దొర్లివుంటే నా దృష్టికి తెస్తే వాటిని దిద్దుకోడానికి ఎప్పుడూ సంసిద్ధుడనే. ఈ పుస్తకానికి తగిన పేరు పెట్టిన శ్రీ మహీధర రామమోహనరావు గారికి, యీ పుస్తకం చదివి అభిప్రాయాలు తెల్పినవారికి, అలాగే పత్రికల వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.