JEEVITHAM MINUS PREMA by SHIVA KUMAR ADELLA Telugu book cover

JEEVITHAM MINUS PREMA

by SHIVA KUMAR ADELLA

₹200
In stock · 21 available
PublisherSAI BABA PUBLICATIONS
LanguageTelugu
నేను ఇండియా వచ్చి పదేళ్ళు అవుతుంది. నాన్న సంవత్సరీకాలకు వచ్చాను మళ్ళీ కుదరలేదు ఇప్పుడే రావటం...పదేళ్ళంటే సుదీర్ఘమైన కాలమే కానీ తప్పలేదు నా పనుల ఒత్తిడి అలాంటిది. బిజీ నటించడం కాదు కానీ నిజంగానే చాలా చాలా బిజీ. నేను నాసాలో సైంటిస్ట్ను... ETSR కు నేను డెప్యూటీ హెడ్ను. అమెరికన్ కాకుండా ఇతర దేశస్థుడికి అంత కీలకమైన పోస్ట్ ఇచ్చారంటేనే నా టాలెంట్, సమర్ధతను అర్ధం చేసుకోవచ్చు. అన్నట్టు ETSR అంటే చెప్పలేదు కదా! ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ సీక్రెట్ రీసెర్చ్... తెలుగులో చెప్పాలంటే ఇతర గ్రహాంతర వాసుల రహస్య పరిశోధన అన్నమాట... ప్రపంచవ్యాప్తంగా ఈరకమైన పరిశోధనలు జరుగుతున్నా అమెరికాలో మాత్రం కొంచెం ఎక్కువ. దీనికి కారణం అమెరికన్స్ ముందుచూపు లేదా దురాశ. భూమ్మీద చేయాల్సిందంతా చేసాక ఇక అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ కూడా పిజ్జాలు, బర్గర్లు, కంప్యూటర్లు, ఆయుధాలు అమ్మాలనుకుంటున్నారేమో నాకు తెలీదు ఎందుకంటే నేను సైంటిస్ట్ను వ్యాపారవేత్తను కాదు.