JEEVITHAME NAVEENAM (GNAPAKALU) by VENIGALLA KOMALA Telugu book cover

JEEVITHAME NAVEENAM (GNAPAKALU)

by VENIGALLA KOMALA

₹100
In stock · 1 available
PublisherKALA JYOTHI PROCESS PVT.LTD
LanguageTelugu
అమ్మ అంతగా తనకిష్టమైన ఆవు చనిపోయినప్పుడు బాధపడడం చూచాను. నాన్న ఆవును ఊరేగింపుగా మా నిమ్మతోటకు తీసుకెళ్ళి అందులో ఖననం చేశాడు. ఆ ఆవుతో మేమూ ఆడేవాళ్ళం. కొమ్ము విసిరేది కాదు. అమ్మతోపాటు మాకు ఆప్యాయత పంచిందా సాధుజంతువు. ఇన్నయ్య హేతువాద ఉద్యమంలో పనిచేయటం వలన సాంబశివరావుగారికి, ఆవుల గోపాలకృష్ణమూర్తిగారికి బాగా పరిచయమున్న వ్యక్తి. ఇద్దరం ఇష్టపడ్డాము. పెండ్లి నిశ్చయమయింది. నాన్న ఎంతకట్నమివ్వగలడో చెప్పాడట. అందుకు ఇన్నయ్య 'కట్నం ఆశించడం లేదు. ఇద్దరం చదువుకున్నాం. స్వశక్తితో బ్రతగ్గలమనే వివాహానికి ఒప్పుకున్నా'నన్నాడట. మా పెళ్ళిలో కట్న కానుకల ప్రసక్తి లేనేలేదు. రాజు యంగ్ గ్లోబల్ లీడరుగా 2007 నుండి 2009 వరకూ వరల్డ్ ఎకానమిక్ ఫోరమికి ఆహ్వానింపబడ్డారు. 2008 చైనా ఒలింపిక్స్కి స్టేట్ గెస్ట్ - టార్చి బేరర్ గా అటెండయ్యాడు. వరల్డ్ ఎడిటర్స్ ఫోరం ఎక్జిక్యూటివ్ మెంబరు అయ్యాడు. సౌత్ ఏషియన్ జర్న లిజమ్ అసోసియేషన్ (న్యూయార్క్) లైఫ్ మెంబరు. ఇండియా ఎబ్రాడ్ పేపరు రాజును "జార్ (Zar) ఆఫ్ ది ఆఫ్ ది డిజిటల్ మీడియా”గా కొనియాడారు. లోగడ ఆ పేపరు వారు రాజును “మ్యాన్ ఆఫ్ ది ఇయర్”గా ఎంపిక చేసి సన్మానించి అవార్డు ఇచ్చారు.