
JEEVITHAME OKA KAVITHA
₹200
In stock · 4 available
PublisherJEEVANA PRACHURANALU
LanguageTelugu
జీవితమే ఒక కవిత భాష కనే కల - కవిత్వం, అది పాడుతుంది ప్రశ్నిస్తుంది సూచిస్తుంది నమ్మకమిస్తుంది జగతికి ధైర్యం నూరిపోస్తుంది తోడై అండగా నిలుస్తుంది అందులో వెలుగుంది చీకటుంది కేవలం నీదే అయిన ఒంటరి తనపు సృజనాత్మకత ఉంది సామాజిక పరమైన సేవాభావం ఉంది మానవత్వానికి అన్ని తలుపులూ మూసుకున్నప్పుడు తెరుచుకుని ఉండే ఒకే ఒక్క ద్వారం కవిత్వం మతం రాజకీయం, ఒక్కోసారి సాంకేతికత సమాజపు నడిరోడ్డు మీద మనిషిని కుళ్లబొడిచినపుడు మనిషిని తట్టి లేపేది కవిత్వం మనిషిని మనిషిగా నిలబెట్టేది కవిత్వం కాలం రాసే కవిత జీవితమయితే జీవితాన్ని రసమయం చేసే కాలం కవితే! ప్రతిక్షణం నవనవలాడేది ప్రతి ఒకరిని తనలోకి ఆహ్వానించేది ప్రతిదాంట్లో అగుపించేది జీవిత ప్రపంచపు పార్శ్వాలన్నీ తిప్పి చూపించేది నిన్నటిని, ఇవ్వాల్టిని రేపటితో అనుసంధానం చేయగలిగేది ఇటు చరిత్రను అటు భవిష్యత్ ప్రగతిని నేటి టెలికాన్ఫరెన్స్కు ఆహ్వానించేది కవిత్వం