JEEVITHAME OKA NATAKA RANGAM by MADDUKURI VIJAY KUMAR Telugu book cover

JEEVITHAME OKA NATAKA RANGAM

by MADDUKURI VIJAY KUMAR

₹100
In stock · 130 available
PublisherMADDUKURI CHANDRAM TELUGU SAMSKRUTHIKA VIKASA KENDRAM
LanguageTelugu
ISBN9789391400866
Jevithame Oka Natakarangam by Maddukuri Vijayakumar నా జీవిత నాటకంలో ఉపాధ్యాయ పాత్రకు గరిష్ట మార్కులు పడతాయి. స్వభావరీత్యా ఉపాధ్యాయుడినని గర్వంగా చెప్పగలను. సావరగూడెంలో మా స్కూలు మాష్టారు శ్రీ గొంది బ్రహ్మయ్య, ముస్తాబాద హైస్కూలు డ్రిల్లు మాష్టారు శ్రీ గోగినేని శ్రీశైలం, ఆంధ్రా లయోలా కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ గోర్డన్, జబల్పూర్ సైన్సు కాలేజీ ప్రొఫెసర్ మహాలహా గార్ల వంటి టీచరు మహానుభావులకు నేను మానసికంగా సన్నిహితుడ్ని. విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కళాశాల, కాకినాడ ఇంజనీరింగ్ కళాశాలలో నా ఉపాధ్యాయ జీవితం ప్రారంభమైనా నా ఉపాధ్యాయపాత్రకు అసలు సిసలైన రంగస్థలం గన్నవరం మండలం, బుద్దవరం గ్రామంలోని వేములపల్లి కోదండ రామయ్య కళాశాల మాత్రమే. టీచరుగా, క్రీడాకారునిగా, రెడ్ క్రాస్ సేవా కార్యకర్తగా నాలోని అంతర్గత శక్తిని వెలికితీసి నన్నొక మనిషిగా తీర్చిదిద్దింది వి.కె.ఆర్. కళాశాల ప్రాంగణమే. అక్కడి విద్యార్థులే నేను సంపాదించుకున్న నిజమైన ఆస్తిపాస్తులు. ఉద్యోగబృందం యాజమాన్యమే జీవితంలో లభించిన నిజమైన మిత్రులు. రిటైరైన 22 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ స్వెస్రం స్కూల్లో 9, 10 తరగతుల పిల్లలకు స్వచ్ఛందంగా పాఠాలు చెప్పగల్గడం, తరగతి మీద, పిల్లలమీద ఉండే అభిమానమే. ISBN: 978-93-91400-86-6 మద్దుకూరి చంద్రం తెలుగు సాంస్కృతిక వికాస కేంద్రం 9 789391 400866 గన్నవరం