JEEVITHAMLONIVE by DR.VIJAYA BHASKARREDDY Telugu book cover

JEEVITHAMLONIVE

by DR.VIJAYA BHASKARREDDY

₹50
In stock · 10 available
PublisherDR.VIJAYA BHASKARREDDY
LanguageTelugu
నామాట ఆయా అంశాలు అవి కలలైనా మనసులోనివైనా, అనుబంధాలనల్లుకొని రాసినవైనా అన్నీ జీవితంలోనివే. ఒక వ్యక్తికి ఒక సంఘానికి, ఒక కాలానికి ఒక జన సమూహానికి మాత్రమే సంబంధించినవి కాక సర్వకాలికమైనవిగా, సర్వజనీనమైనవిగా రూపొందించయత్నించాను. నాలో భిన్న భిన్న సమయాల్లో కలిగిన వివిధ స్పందనలకు ప్రతిరూపం ఈ చిన్న పుస్తకం. ఈ పుస్తకాన్ని చదివిన శ్రీ సుద్దాల అశోక్ తేజ, శ్రీ ఎస్సస్ తేజ సోదరుల విజ్ఞప్తి మేరకు ప్రచురణకు పూనుకున్నాను. నా ఈ ప్రయత్నంలో నా కవితలను ముందుగా చదివి ఎంతగానో ప్రోత్సహించిన శ్రీ గద్దె లక్ష్మినారాయణ గారి ప్రోద్భలమూ వుంది. విలువలతో కూడిన జీవితాన్ని ఏ మాత్రం నా రచన ప్రేరేపించినా నా ధ్యేయం నెరవేరినట్టేనని భావిస్తాను. నా పుస్తక ప్రచురణ బాధ్యతను హృదయపూర్వకంగా స్వీకరించి కృతకృత్యుడైన ఎస్సెస్ తేజ గార్కి, ముందుమాట వ్రాసిన నా అభిమాన కవి జ్ఞాపపీఠ అవార్డు గ్రహీత, తెలుగు వారు గర్వించదగ్గ సాహితీ, సాంస్కృతిక సౌశీల్యాలకు నిధి సి.వా.రె గారికి నన్ను పరిచయం చేసిన ఆత్మీయులు సుద్దాల అశోక్ తేజ గారికి నా కవితలు చదివి నన్ను ప్రోత్సహించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి అవార్డు గ్రహీత శ్రీ శ్రీనాదె శంకర కవి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. అందమైన ముఖచిత్రాన్ని సకాలంలో చిత్రించి ఇచ్చిన లక్ష్మణ్, ధని ఏలె గారలకు కృతజ్ఞతలు, అలాగే పుస్తకరూపంలో కూర్చకముందు నా కవితల్ని ఒకానొక కాలంలో చదివి నన్ను మనసారా అభిమానించి ప్రోత్సహించిన కీ.శే.సంజీవ్ దేవ్ గారికి నేను ఋణపడివున్నాను. నా చిన్ననాటి స్నేహితులు డా॥ భండారు ఉమా మహేశ్వర్ రావు మరియు డా॥ చంద్రకాంత్ రావు మెడికల్ కాలేజిలో అంతవరకు ఆంగ్లంలో కవితలు రాసిన నన్ను తెలుగులో వ్రాయమని ప్రోత్సహించారు. నా సాహితీ వ్యవసాయంలో నాకు ఇతోధికంగా తోడ్పడిన వారందరికి, మరియు డి.టి.పి. ఆపరేటర్ వెంకటేష్ నేతా, చిత్రలిపి యజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.