JEEVITHANIKI MULAADHARAMAINA VYAVASAYAM by K.SURESH Telugu book cover

JEEVITHANIKI MULAADHARAMAINA VYAVASAYAM

by K.SURESH

₹80
In stock · 1 available
PublisherMANCHI PUSTHAKAM
LanguageTelugu
ISBN9789380153209
సర్ ఆల్బర్ట్ హవార్డ్ (1873-1947)ని సేంద్రియ వ్యవసాయ ఉద్యమపితగా పరిగణిస్తారు. రసాయనిక ఎరువుల వల్ల ప్రయోజనం కంటే నష్టాలు ఎక్కువ అని గుర్తించిన మొట్టమొదటి వాళ్ళల్లో అతడు ఒకడు. దీర్ఘకాలంలో రసాయనిక ఎరువులు నేల జీవ గుణాన్ని చంపేసి తెగుళ్ళకు కారణమవుతాయి. దీనికి విరుద్ధంగా నేలసారంలో కీలకాంశమైన హ్యుమస్ మొక్కలు, పశువులు, మనుషులకు ఆరోగ్యాన్ని, రోగనిరోధకశక్తిని ప్రసాదిస్తుంది. 1905-1931 మధ్యకాలంలో హవార్డ్ భారతదేశంలో గడిపాడు. మొదట (1905-1924) బీహార్ లోని పూసా వద్ద వ్యవసాయ కేంద్రంలో ఇంపీరియల్ కెమికల్ బొటానిస్ట్గా పనిచేశాడు. ఆ తరువాత (1925-1931) ఇందోర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ ఇండస్ట్రీకి సంచాలకులుగా పనిచేశాడు. 1926లో భారత సైన్స్ కాంగ్రెస్కి అధ్యక్షులుగా ఉన్నాడు. 1931లో అతడు ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళి అక్కడి నుంచి తన భావాలను ప్రచారం చేశాడు. అతడు రెండు ముఖ్యమైన పుస్తకాలు రాశాడు: 'ద అగ్రికల్చరల్ టెస్టామెంట్' (1940), 'ద సాయిల్ ఎండ్ హెల్త్' (1945). అతడి భావాలు ప్రపంచవ్యాప్తంగా వేళ్ళూనుకుని అనేక మంది వ్యక్తులు, సంస్థలు ఈ సూత్రాలపై పని చెయ్యసాగారు. దీంట్లో ప్రముఖంగా పేర్కొనదగింది లేడి ఎవా బాల్ఫోర్, ఆమె రాసిన 'ద లివింగ్ సాయిల్'. అమెరికాలో జె ఐ రొడేల్ 'ఆర్గానిక్ గార్డెనింగ్ ఎండ్ ఫార్మింగ్' అన్న పత్రిక ప్రారంభించి సేంద్రియ ఉద్యమానికి ఆద్యుడయ్యాడు.