JEKAMUKASANCHI by CHILLA MALLESHAM Telugu book cover

JEKAMUKASANCHI

by CHILLA MALLESHAM

₹40
In stock · 193 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. ఊరవిశ్క తెప్పన తెల్లారింది. దబ్బున లేశిన, కళ్లు పొడుసుక సూత్తె ఎదురుంగ చెల్లె, ఎంటికలిరవోస్కొని ఒకటే ఏడుపు. 'ఎందె..?', 'ఆ.. ఆ.. ఆ..', 'ఈ.. ఈ.. ఈ..', 'ఏ.. పి. ఎ..!' 'చెల్లె ఏందె..?', 'ఊ.. ఊ.. ఊ..' ఒకటే దీర్ఘందీత్తంది! 'డబల్అట్టెట.. డబల్ రొట్టె..! రోజిదేపని..! ఏడికివోవాలె పైసలకు..! మీ అయ్యేమన్న నౌకరిగాడా..?' అకిట్ల అవ్వ గునిపిత్తంది. 'ఇటు రాయె..' చెల్లెను పిలిశిన. కండ్లు తుడుసుకుంట దగ్గరికొచ్చింది. ఏడుపాపి ఎగవోత్తంది. 'ఆయైందా.. ఏడ..?' అనడిగిన, నెత్తిమీద అవ్వేడగొట్టిందో సూయించింది. మాడ మీద శెయ్యేసి నిమిరిన. ఎగవోత కొంచెం తగ్గింది. అవ్వ లోపలికొచ్చింది. 'బొండిగెవిస్కుత బిడ్డ మళ్లోసారేడై..!' అని గద్దరిచ్చెవరకు మళ్ల ఏడుపు మొఖం బెట్టింది. నేను 'ఊకో.. ఊకో..' అనంగనే అండ్లదండ్ల మింగింది. సాట్ల బియ్యం బోస్కొని అవ్వ వేయింది. బయిట బియ్యం జెరిగిన నప్పుడైతంది! 'కిన్.. కిన్.. కిన్..!' 'ఊరవిశ్కలచ్చినట్టున్నయ్..' అనన్న. చెల్లె మొఖం సాటంతైంది. లగాంచి బయిటికుర్కింది. ఎన్కనే నేను వేయిన. చెల్లె పిడాతవొయ్యెవరకు పిట్టల్లేశి పేయినయి! అవ్వ బియ్యం జెరిగి సాటాడవెట్టి ఎటో వేయింది. నేను మెల్లగ లోపలికి వేయిన. అటీటుజూశి గిన్నన్ని బియ్యంబట్కొని బయిటికచ్చిన. నా శేతుల బియ్యం జూశి, చెల్లె కండ్లింతైనై. 'కట్టె దేపోయె చెల్లె..' అనంగనే పెంట మొఖానవేయింది. పొడుగుద్దెత్తె సగానికిరిశినం. సాటను నిలవెట్టి కట్టానువెట్టినం. సాటలోపల్కేలి ముందటిదాక బియ్యం జల్లి ఎనుక గూసున్నం. ఇంటి సూర్ల దిక్కు సూత్తన్నం. శెవులటువెట్టి సప్పుడింటన్నం. 'కిస్.. కిస్.. కిస్..!' గప్పడిదిగప్పుడె సూర్లకేలి రెండు పిట్టలచ్చినయ్. బియ్యం బుక్కుడు షురు జేశినయ్. ఓటి బుక్కుకుంట బుక్కుకుంట సాట్లదాకచ్చింది. నేను సప్పుడు జెయ్యక జెప్పన కట్టె గుంజిన! సాటవొయ్యి పిట్ట మీద వడ్డది. దాన్ని మెల్లగ లేపి పిట్టను దొర్కవట్టిన! 'హిహ్హహి..' చెల్లె పండ్లిగిలిచ్చింది. జెకముకసంచి చిల్ల మల్లేశం