
JO LAALI - U.SA PAATALU
₹150
In stock · 5 available
PublisherU.SA SMARKA COMMITEE
LanguageTelugu
ఉషోదయం నుండి సూర్యోదయానికి ... ఆకాశాన్నుండి నేల మీదికి దించి, సాహిత్యంతో సామాన్యుడికి సేవ వేయించాడు శ్రీశ్రీ. ఒక వాగ్గేయకారునిగా తన పాటలతో, మాటలతో పోరాటానికి పురుడు పోసి, పేదవాడికి పట్టాభిషేకం చేయించాడు ఊ.సా. ఊ.సా. ఉద్యమాల ఉపాధ్యాయుడు కాకముందే ప్రజా వాగ్గేయకారుడు. జనసాహితికి జీవం పోసిన వాళ్ళలో మేటి. దోపిడి రాజ్యం పై సంధించిన ధిక్కార స్వరం. అందుకే... అతని అక్షరాలకి ఆదిలోనే సంకెళ్ళుపడ్డాయి. అయినా, అప్పుడూ... జైలు గోడలే కాగితాలయ్యాయి. వాటిపై రాసిన రాతలు శిథిలం కాని శిలాక్షరాలయ్యాయి. అవి జ్వలించే జ్వాలలయ్యాయి. జోకొట్టే జోలలూ అయ్యాయి. చందమామని నెచ్చెలి మోముతో పోల్చి కవిత్వాల్ని వండి వార్చిన కవులెందరో ఉన్నారు. వెన్నెల విరహ గీతాలాపనలు చేసిన వారూ ఉన్నారు. చివరికి వెన్నెలనే "విరహాగ్ని" గా మార్చేశారు. అలా మనసుల్లో కూర్చేశారు. మనకు వెన్నెలంటే తెలిసింది కానీ... వీటికి విరుద్ధంగా అక్కడక్కడ వెన్నెల గురించి విలువలు కలిగిన వర్ణనలూ ఉన్నాయి. ఒకనాడు రాజ్యపనుల భారంతో విసుగు చెంది, తన భవనం పై వెన్నెల్లో మంత్రులతో కలిసి కూర్చుని- "ఈ వెన్నెల ఎంతో హాయిగొల్పుతుంది. ఈ ప్రశాంత వెన్నెల్లో బుద్ధుని ధర్మ సందేశాన్ని వినాలనే కోరిక కలుగుతోంది". అంటాడు మగధ చక్రవర్తి అజాతశత్రు. ఆ వెన్నెల్లో రాణులతో సరసకేళీ విలాసాలల్తో ఊగి తూగాలి అనుకోలేదు ఆయన.