JOKULU VEYEE by KONDURI KASIVISWESWARA RAO Telugu book cover

JOKULU VEYEE

by KONDURI KASIVISWESWARA RAO

₹70
In stock · 3 available
PublisherKONDURI KASIVISWESWARA RAO
LanguageTelugu
హాస్యభేరి జీవితమంతా ఆడుతూపాడుతూ ముందుకు సాగిపోవాలని అందరు అనుకుంటారు. కానీ కొన్ని సమస్యలు మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు. అలాం సమయంలో ఛలోక్తులు చదివితే ఆనందం మనతోనే ఉంటుంది. హాస్యభరితమైన నాటకాలు, సినిమాలు చూడటం వలన కడుపులోని మంట (Acidity) మటుమాయమై పోతుంది. అనేక రుగ్మతలకు "హాస్యరసం . Laughter is the best medicine for good health ఈ టానిక్ను మనం ప్రతి సంవత్సరం మే 2వ తేదీన "ప్రపంచ నవ్వుల దినోత్సవం" నాడు ఆస్వాదిస్తున్నాం. రోజురోజుకీ సమాజమునందు పెరిగిపోతున్న అశాంతి హాస్యం ఓ చక్కని పరిష్కారం. నాకు హాస్యమంటే చాలా ఇష్టం. ఎలాంటి సమస్యనైనా చిన్న జోక్గా మార్చి బాధపడేవారిని నవ్వించి, సంతోషాన్నందించే వాడిని. నా జోకులు విని మా అమ్మగారు శ్రీమతి కొండూరి రాజరాజేశ్వరి నాకు "వికటకవి" "విట్టూ"" యనెడి రెండు బిరుదులను ప్రసాదించింది. తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని దర్శించి, వేయిస్తంభాల మండపము నందు విశ్రమిస్తే పుణ్యంతో పాటు మనశ్శాంతి కల్గును. అలాగే ఓరుగల్లు నందు గల "వేయిస్తంభాల గుడిని " చూస్తే బ్రహ్మానందమొస్తుంది. అందుకే అందరికీ ఆనందాన్ని, వినోదాన్ని, నవ్వుల పువ్వులను పంచాలని “జోకులు వేయి” ని మీ ముందుంచాను. ఇక నుండీ "జోకులు వేయి నీ మనసంతా హాయి” నవ్వటం ఒక భోగమని, సవ్వించటం ఒక యోగమని, నవ్వలేకపోవటం ఒక రోగమని నిర్వచించిన "హాస్యబ్రహ్మ కీ॥శే॥ జంధ్యాలగారి సినిమాలు చూచి హాస్యం పట్ల ప్రభావితుడనయ్యాను. హాస్యవిష్ణు కీ.శే॥ ఇ.వి.వి. సత్యనారాయణ, మరియు ఈనాటి హాస్యమహేశ్వరుడు శ్రీ రేలంగి నరసింహారావు గారికి అభిమానినైనాను.