
JULAKATIKA KONTE PRASHNALU TUNATARI JAVABULU
₹30
In stock · 11 available
PublisherMAMIDI VIMALA
LanguageTelugu
జూలకటిక జోక్స్ అంతరంగానికి అక్షరరూపం ప్రియపాఠకులకు నా మనవి... ఈ మధ్య నేను రచించిన పుస్తకాలలోని ముందుమాటలో పాఠకుల అమూల్య అభిప్రాయాలను, అర్థవంతమైన విమర్శలను తెలియచేయవలసిందిగా వ్రాసాను. అందుకు స్పందించిన కొందరు పాఠకులు నాకుఫోన్ చేసి "శైలిగారూ.. మీరు ఇంటర్మీడియట్ మాత్రమే చదివానని అంటున్నారు. జోక్స్, వంటలు, పిల్లపేర్లు, ప్రేమశాస్త్రం, అనురాగదాంపత్యానికి అద్భుతచిట్కాలు, విజయానికి మరోమెట్టు, దేవుని దర్శిద్దాం రండి.... ఇలా విభిన్న అంశాలు గల 200లకు పైగా పుస్తకాలను ఎలా వ్రాసారు? వీటిని వ్రాయటానికి మీకున్న అర్హతలు ఏమిటి? ఏ రచయిత అయినా ఒకటి లేక రెండు అంశాలలో మాత్రమే తన "కలం బలం"ను చూపించగలడు. మరి మీరు అన్ని అంశాలను ఎలా వ్రాయగలుగుతున్నారు. అతి తక్కువ కాలంలో 200లకు పైగా ఎలా రచించగలిగారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంకొందరు అయితే ఉత్తరాల ద్వారా తమ మనోభావాలను ఇలా ప్రశ్నల రూపంలో తెలియచేశారు. మరికొందరు ముఖాముఖిగా కలిసినప్పుడు అడిగేశారు. ఎవరు ఎన్ని విధాలుగా అడిగానా... ఎన్ని రకాలుగా ప్రశ్నించినా.. వాళ్ళ అందరికి అభిమానానికి కృతజ్ఞతగా.. వాళ్ళకు జవాబు చెప్పవలసిన బాధ్యత ఉన్నందుకు.. పాఠకుల సందేహాలను తీర్చుటకొరకు... నా రచనా ప్రవాహంలోని సక్సెస్సక్రేట్ను, వివిధ అంశాలుగల రచనలను రచించుటకు నాకున్న అర్హతలను ఇప్పుడు తెలియచేస్తున్నాను. ఇది ఏనాటికైనా ఏదో ఒక సందర్భంలో తెలియచేయవలసిన అంశమే. కానీ ఆ అవసరం... అవకాశం.. ఇంత త్వరగా వచ్చినందుకు సంతోషిస్తున్నాను.