
JULURU PADHAM
₹300
In stock · 73 available
PublisherSPRUHA SAHITHI SAMSTA
LanguageTelugu
ఇతడ్ని నిప్పుకు దూరంగా ఉంచండి. విస్ఫోటిస్తాడు. ఇతడ్ని నీటితో ఆర్పాలని చూడకండి. బడబాగ్నిలా మారతాడు. ఇతడ్ని అడవిలో బంధించకండి. దావానలమవుతాడు. ఇతడ్ని లాలించి బుజ్జగించి రవ్వంత ప్రేమనివ్వండి. లోకమంతటా వెలుగు విరజిమ్మే దీపశిఖ అవుతాడు. పుట్టుకకూ మరణానికీ మధ్య జీవితం ఒక దీర్ఘ శ్వాస. చాలామంది అలా గాలి పీల్చి ఇలా వదిలేస్తూ బతికేస్తారు. జూలూరు అలాకాదు. ఐదుపదుల ఉచ్ఛ్వాసనిశ్వాసల్లో తిరుగుబాటు తుఫానులు వీచాడు, ఉద్యమ వడగాలులు పేల్చాడు. కవనపవనాలు దూసాడు. ఆ శ్వాస స్పష్టతే ఈ కవిత దీర్ఘత. ఇదొక కవి నడత. అక్షరాన్ని ఆలపించే కాగితంలోంచి చెట్టు పునర్జన్మ నవ్వినట్టు, నినాదఫలం పంచే ఉద్యమ పరిమళం చేతులుజాపి భుజం తట్టినట్టు అతడు రాస్తూ పోరాడుతూ తపిస్తూనే ఉంటాడు నిరంతరం. ఇదొక దార్శనికుని నవత. పాదముద్రలకు ఎలియాస్ లుండవు. కేరాఫ్ కన్నీళ్ల, ఉరఫ్ ఉద్వేగాల గాయాలతో పగుళ్లతో అడుగులు భారంగానైనా సరే ముందుకే పడాలి. ఇదొక వీరుడి నడక. గెలుపోటములు, విషాదానందాలు, మెరుపులు మరకలు ఈ పద్య పాదాలు వాటి ముద్రలున్నూ. ఉద్యమం, కవిత్వం జమిలిగా కుమిలి పెగిలిన జీవన ఆలాపన ఈ బాడిసె గానం ఈ కలం పాట ఈ ఉద్యమ గీతం. -ప్రసేన్ స్పృహ సాహితీ సంస్థ హైదరాబాద్