
JWALAPATAM
₹100
In stock · 2 available
PublisherSASIKANTH SATAKARNI
LanguageTelugu
కంటిపాపపై నీటిపొర మా అమ్మకు నీళ్ళంటే ఎంత ఇష్టమో ! చేత జలకలశం లేకుండా ఆమె కనబడే సమయం నిద్రపోయినప్పుడు మాత్రమే ! నీటితో శుద్ధి కానిది ఏదీ లేదని ఆమె ప్రగాఢ విశ్వాసం ! మా అమ్మ మా ఊరికి వచ్చినప్పుడు కుంతీ మాధవస్వామి కొలను ఆమెకి స్వాగతమిచ్చింది ! ఆమె ఈ లోకం విడిచి పోయినప్పుడు స్మశానానికి ఆనుకొని ఉన్న పాదగయ కొలను ఆమెకు వీడ్కోలు పలికింది ! అన్నట్టు మా అమ్మను మీరు చూడలేదు కదూ ! నేను మా అమ్మకు నకలునే ! మా అమ్మ మరణించలేదు నాలోనే బ్రతుకుతోంది ! నా కంటి పాపపై నీటి పొరగా నా హృదయంలో తడి నీడగా నాలో ఇగిరిపోని మానవత్వపు ఆర్ద్రతగా కడదాకా మా అమ్మ i నాలో మిగిలే ఉంటుంది !