
JYOTISHYA VASTU RUDRAKSHA SPATIKA KUNDALINI KRIYAY
₹70
In stock · 17 available
PublisherKOWTA MARKANDEYA SASTRY
LanguageTelugu
కవుత మార్కండేయ శాస్త్రీ 22-09-1946న కవుత సుబ్బారావు, శ్రీమతి కవుత శ్యామలాంబ దంపతులకు గుంటూరు నందు జన్మించిరి. సైన్సులలో పట్టభద్రులైరి. తదుపరి విశాఖపట్టణములో ఎం. ఎ. (లెక్కలు) చదువుతున్న సమయములో 22-09-1966న కేంద్రప్రభుత్వ ఉద్యోగములో చేరిరి. ఆధ్యాత్మిక ఉన్నతికై ఆసేతుహిమాచల పర్యంతము విస్తృతముగా భార్యా సమేతముగా పర్యటించిరి. స్వప్నంలో కనబడిన సాయిబాబా వారి దివ్యమైన సలహా మీద యోగదా సత్సంగసమతి, రాంచి వారి సభ్యత్వము భార్య, కూతురు సమేతముగా తీసుకొనిరి. ఆ తదుపరి క్రియాయోగదీక్ష తీసికొనిరి. తీవ్ర యోగాధ్యానము చేసిరి. 30-09-2006న కేంద్రప్రభుత్వ విరమణ తదుపరి యోగదాసత్సంగ సమితి వారి అనుమతితో ద్యాన మందిరం కట్టించిరి. 09-10-2007న రాంచి వై. యస్. యస్. స్వామి శ్రీ శ్రద్ధానంద స్వామి వారిచే మందరిము ప్రారంభోత్సవము చేయించిరి. అప్పటి నుండి క్రియాయోగాభ్యాసులకు వై.యస్.యస్. నియమములకు భంగము కలగకుండ భక్తులకు ఉచితరీతిన సలహా నొసగుచుండిరి. శ్రీ శాస్త్రి గారికి 26-04-1970న శ్రీ కొత్తపల్లి రామపూర్ణ చంద్రరావు, శ్రీమతి కనకదుర్గాంబల తృతీయపుత్రిక శుభలక్ష్మితో వివాహమైనది. కూతురు శ్యామల, అల్లుడు మహేష్ వేమూరి ఇద్దరూను క్రియావనులే. శ్రీ శాస్త్రి, శుభలక్ష్మి దంపతులకు ఎన్నో మారులు ఆరుగురు సత్ గురువుల దర్శనములు అయినవి. ఈ విషయము బాహాటముగా చర్చించుటకు ఇష్టపడరు. ఈ ఆధ్యాత్మిక గ్రంథము స్వీయానుభవముతో, గడించిన ఆపార జ్ఞానముతో, ముఖ్యముగ బాబాజి, గురుదేవుల ఆశీస్సులతో ఇంగ్లీషు మరియు తెలుగు భాషలలో రచించిరి.