KAAKI NEETHI - 40 by SARADA ASHOKAVARDHAN Telugu book cover

KAAKI NEETHI - 40

by SARADA ASHOKAVARDHAN

₹40
In stock · 629 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. బాలయ్య ఉపాయం! బాలయ్యంటే ఆ వూళ్లో అందరికీ దేముడితో సమానం. అందరికీ తల్లో నాలుకలా ప్రవర్తిస్తాడు. బాలయ్య బట్టలుతికి తెస్తే అవి మల్లెపూలలా మెరుస్తాయనేవారు. అంత చక్కగా ఉతికి, ఇస్త్రీ మడత చేసి, ఇంటి కెళ్లి ఇచ్చొస్తాడు. బాలయ్య ఆస్తి కంతా కారణం, తన మంచి పేరుకు కారణం తన గాడిద బిప్పీయేనని అతడు అందరికీ చెప్తాడు. చెప్పడమే కాదు, అతడి నమ్మకంకూడా. అందుకే దాన్ని గాడిద అనకుండా ముద్దుగా బిప్పీ అంటాడు. బిప్పీ ఇంటికొచ్చిన వారం రోజులకే బాలయ్య భార్య గోవిందమ్మ పండులాంటి కొడుకుని ప్రసవించింది. అందరూ 'గొట్టొచ్చిన వేళా బిడొచ్చిన వేళా' అంటే ఇదే... "నీ గాడిద... అదే... నీ బిప్పీ నీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది” అనేవారు. ఇంటింటికీ వెళ్ళి మోసుకొచ్చిన బట్టల మూటలన్నీ మోసి, రేవుకెళ్ళి మళ్ళీ ఇంటికొచ్చేదాకా బిప్పీ నుంచునే వుంటుంది. ఎన్ని మూటల బరువునైనా మోస్తుంది. ఇంటికి రాగానే ముందు బిప్పీకి స్నానం చేయించి, తుడిచి ప్రేమగా దానికి దాణా! పెట్టాకే, తను స్నానం చేసి, భోంచేసి అప్పుడు తన ముద్దుల కొడుకు పప్పూతో గంటసేపు ఆడుకుని, ఆ తరవాత ఇతర పనులు చేసుకుంటాడు. పప్పూ అసలు పేరు 'పరమేశు’ అని పెట్టాడు. ముద్దుపేరు పప్పూ, పప్పూ, బిప్పీ ఇద్దరూ రెండు కళ్ళు బాలయ్యకి. గోవిందమ్మకి మాత్రం పంచప్రాణాలూ పప్పూయే! కాలం గడుస్తోంది. పప్పూ పెద్దవాడవుతున్నాడు. బడికి పంపించాడు బాలయ్య. అతిగారాబంతో ముద్దుతో పప్పూకి కొంచెంకూడా కష్టపడడం అలవాటు కాలేదు. ఇరవై నాలుగుగంటలూ ఏదో ఒకటి తింటూనే వుండడం లేదా ఏవో పిచ్చి పిచ్చి ఆటలూ, మాటలూ లేకపోతే నిద్రపోవడం. బళ్ళో చెప్పే అక్షరాలుకూడా రాయలేకపోతున్నాడు. అస్తమానం ఏదో తింటూనే కాలం గడిపే పప్పూ విపరీతంగా లావయిపోతున్నాడు. పనీపాటా లేకపోవడంతో ఇరవై నాలుగు గంటలూ తిండి ధ్యాసే. అయినా గోవిందమ్మ పిచ్చి ప్రేమతో వాడడిగిందల్లా ఇస్తుంది. ఒక్కమాట కూడా అనదు వాణ్ణి. భర్తని అననివ్వదు. "నీ అతి ప్రేమతో వాణ్ణి పాడుచేస్తున్నావ్. భవిష్యత్తులో వాడు ఎందుకూ కొరకాకుండా పోతాడు" అని హెచ్చరించినా, ఆమె పిచ్చి ప్రేమతో కొడుకునే వెనకేసుకొస్తుంది గానీ బాలయ్య మాట వినదు. బాలయ్య ఈ విషయంలో నిస్సహాయుడయ్యాడు. చూస్తూ చూస్తూ కాలచక్రంలో మరో పదేళ్ళు గడిచాయి. పప్పూలో మంచి మార్పు రాలేదు సరికదా, శరీరమూ దానితోపాటు సోమరితనమూ, మందబుద్ధీ అన్నీ పెరిగాయి. అందరూ