KAASI DARSHANAM (KSHETRA MAHIMA - SAMPRADAYALU) by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA Telugu book cover

KAASI DARSHANAM (KSHETRA MAHIMA - SAMPRADAYALU)

by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA

₹120
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
ముఖచిత్రానుబంధం 19వ శతాబ్దంలో జేమ్స్ ప్రిన్సెప్ (1799-1840) కాశీలో పర్యటించాడు. జర్నల్ ఆఫ్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ వ్యవస్థాపక సంపాదకుడైన ప్రిన్సెప్ ప్రాచీన భారతకాలం నాటి బ్రాహ్మి, ఖరోస్తి లిపులను చదవడంలో, ప్రమాణీకరించడంలో ప్రధానపాత్ర పోషించిన పరిశోధకుడు. నారాయణభట్ట పర్యవేక్షణలో నిర్మించిన ఆలయపు పథకరచన (ప్లాన్ )తో గ్రాఫ్ తయారు చేయించాడు ప్రిన్సెప్. ఆలయ నిర్మాణ విశేషాలను మనకందించే అతికొద్ది ఆధారాలలో ఈ లితోగ్రాఫ్ ఒకటి. 124x124 అడుగుల చదరపు పీఠం మీద ప్రధానాలయం నిలబడింది. తూర్పున 125x35 అడుగుల వైశాల్యంతో నిర్మించబడిన రంగమండపం ఆధ్యాత్మిక ప్రవచనాలకు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు వేదిక అయ్యేది. అల్టేకర్ అభిప్రాయం ప్రకారం "రంగమండపం గోడలు, స్థంభాలపై దైవ విగ్రహాలు, శిల్పసంపద లేకపోవడంతో ముస్లిం అరాచక మూకలు పాక్షికంగా మాత్రం ధ్వంసం చేసి వదిలేశారు. తోడర్మల్ ఇంజనీర్లు కొద్దిపాటి మరమ్మత్తులతో రంగమండపాన్ని సిద్ధం చేశారు. ముస్లిం పాలకులకు భవిష్యత్లో మళ్ళీ అగ్రహం కలిగే విధంగా గోడలపై శిల్పాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే మధ్యలో గుమ్మటం వంటి ఆకారం ఎటువంటి ప్రత్యేక అలంకరణ లేకుండా నిర్మించబడింది. ప్రిన్సెప్ట్ రచన 'బెనారస్ ఇలస్ట్రేటెడ్' లో 1585లో నిర్మించిన ఆలయపు పార్శ్వచిత్రం (సైడ్ ఎలివేషన్) అందించబడింది. 'శివా నీ నిరీక్షణలో' పుస్తకం నుండి పై పంక్తులు తీసుకోవడం జరిగింది. మూల రచయిత విక్రమసంపత్ కు, అనువాదకులు గుంటూరు కుమారలక్ష్మశాస్త్రి గారికి ధన్యవాదాలు.