
KAASI PATNAM CHUDARA BABU
₹100
In stock · 29 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
నవల. సాహితీ ప్రపంచంలో అగ్రస్థానం పొందిన ప్రక్రియ సుమారు నాలుగు దశాబ్దాల క్రిందట నవల చాలా విస్తారంగా ఉండేది. ఆరేడు వందల పేజీలు ఉండేది. నారాయణరావు, కాలాతీతవ్యక్తులు, జీవన తరంగాలు, హిమజ్వాల ఇవన్నీ నిడివిగల నవలలు. తరువాత నవల రూపంలో మార్పు వచ్చింది. పత్రికలూ అనుబంధ నవలలను ప్రవేశపెడుతూ వందకు తక్కువగా ఉండాలి పేజీల సంఖ్య అని నియమం విధించటంతో ఒడ్డులొరుసుకుంటూ ప్రవహించిన నది వంటి నవల పిల్లకాలువలా రూపు మార్చుకుంది. నిజం నిష్ఠూరమే అయినా చిక్కిపోయిన నవలలో నవలకుండవలసిన లక్షణాలు లోపించాయి. ఫలితం నవలకు ప్రజాదరణ తగ్గిపోయింది. దానికి తోడు ఇంగిలీషు నవలల ప్రభావం తెలుగు నవలల మీద పడి నవలల్లో తెలుగుతనం లోపించింది. సస్పెన్సు ప్రధానాంశం అయిపోయింది. చదివినంతసేపూ బాగానే వున్నా మరుక్షణం మర్చిపోతున్నారు పాఠకులు. సరే మరి మార్పులు సహజం. ఇటువంటి సమయంలో వడ్లమాని మణి 'కాశీపట్నం చూడరా బాబూ' అని ఒక నవల రాశారు. ఇది ఆమె రెండవ నవల. పేరులోని తెలుగుతనం నవలలో కూడా వుంది. ఇది ఒక ప్రయాణం. ప్రయాణం అంటేనే ఎంతోమంది వుంటారు. ఈ నవలలోనూ వున్నారు. ఎన్నో పాత్రలు అతివేగంగా వచ్చేసి మొదట్లో గాభరా కలిగించినా, రైలు ఎక్కగానే హడావిడిగా వున్నా కాసేపటికి అంతా సర్దుకున్నాక ప్రయాణం సాఫీగా సాగినట్లూ సాగుతుంది.