KACHATATHAPALU by BHAMIDIPATI BALATRIPURASUNDARI Telugu book cover

KACHATATHAPALU

by BHAMIDIPATI BALATRIPURASUNDARI

₹50
In stock · 17 available
PublisherSRI MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
శబ్దచిత్రాలై వినిపించే కథలు కథ వ్రాయటం కళకు సంబంధించిన అంశం. కాగా, కథ చదవటం సమాజపరమైన అంశం అవుతుంది. రచయిత కళకూ, పాఠకుడు సమాజానికి సంబంధించిన వ్యక్తులు సమాజంలోని వ్యక్తులంతా పాఠకులు కాలేరు. పాఠకులు మాత్రం సమాజ పరమైన అంశాల గురించి ఆలోచించేవారుగా ఉంటారు. ఉన్నత స్థాయి రచయిత, ఉన్నత స్థాయి పాఠకుడూ కళాత్మకంగా సమాజానికి ప్రతిస్పందిస్తారు. సమాజంలోని మంచి చెడ్డలకు ప్రతిస్పందించే స్వభావం ఉన్న వాడే పాఠకుడు కాగలుగుతాడు. ఈ పాఠకుడి కోసం ముందుగా రచయిత తీవ్రంగా ప్రతిస్పందిస్తాడు. పాఠకుడు ఆ తీవ్రతను అందుకుంటాడు. సాహిత్య ప్రయోజనం నెరవేరాలంటే రచయిత, పాఠకుడూ ఇద్దరిలోను స్పందించే గుణం ఉండడమే ముఖ్యమైన అంశం. సాహిత్య ప్రయోజనం, సాహిత్య విలువలతోపాటు రచయితకు సాహిత్యం అంటే ఏమిటో, అది కలిగించ గల ప్రభావం ఏమిటో మంచి అవగాహన ఉండాలి. సాధారణంగా ప్రతి కథ, ప్రతి నవల, ప్రతి కవిత సమాజంలోనే పుడుతుంది. సాహిత్యానికి పుట్టిల్లు సమాజమే! సంఘటనని యథాతథంగా వ్రాసినా, సహజత్వం చెడకుండా వ్రాసిన రచన రచనే! యథాతథంగా వ్రాస్తే, అది వార్తాప్రతికలో వార్త అవుతుంది. దాని పూర్వాపరాల విశ్లేషణతో కలిపి వ్రాస్తే అది వ్యాస రచన అవుతుంది. కవిత్వీకరించ గలిగితే అది కవిత అవుతుంది. స్వకపోల కల్పిత సన్నివేశాలతోరక్తి కట్టే రీతిలో వర్ణిస్తే అది నవల అవుతుంది. ఎలా వ్రాస్తే అది కథ అవుతుందన్నదే ప్రశ్న. ఒక సంఘటన ఆధారంగా చిత్రకారుడు బొమ్మని చిత్రించటం లాంటిది కథారచన అని కాళీపట్నం రామారావుగారు చెప్తారు. "చిత్రరచనకూ, కథారచనకూ కొన్ని దగ్గర పోలికలున్నాయి. తద్వారా కథంటే ఏమిటో కొంత తెలుసుకోవచ్చు" అంటారాయన. కథని వ్రాయటం అంటే సంఘటనను బొమ్మగా గీయటం అన్నమాట. సమాజంలో జరిగే వాస్తవాలకి ఈ దృశ్యీకరణం అనేది చాలా ముఖ్యం. బొమ్మని వ్రాసి చూపించటం లేదా సంఘటనని గీసి చూపించటం కథ అని చిన్నగా నిర్వచించవచ్చు. కథలో శబ్దచిత్రాలు ప్రతిధ్వనిస్తుంటాయి. సమాజానికి సంబంధించిన కథల్లో సంక్షిప్త శబ్ద చిత్రాలు కళ్ళముందు కదలాడుతుంటాయి. కథయిత్రి శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరి ఈ సంక్షిప్త శబ్ద చిత్రతను బాగా ఆకళింపు చేసుకున్నారు. ఈ సంపుటిలోని కథలు చదివినప్పుడు ఆమె కథా రచన మీద కొంత పట్టు సంపాదించుకున్నట్టు బాగా కనిపిస్తోంది. ఆమె నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవాల్ని 'ఇంటింటి కథలు' అనడం వలనే ఇంత చర్చ చేయవలసి వచ్చింది.