KALA NAADU - NEDU by Y.KALA SAGAR Telugu book cover

KALA NAADU - NEDU

by Y.KALA SAGAR

₹299
In stock · 20 available
PublisherY.KALA SAGAR
LanguageTelugu
కళ అంటే ? సాధారణంగా మన ఇళ్లలో పిల్లలు పలక మీద ఏవేవో గీతలు గీస్తుంటారు. అవి నచ్చకపోతే చెరిపేసి, పిల్లి లేదా పక్షి బొమ్మలు గీయడానికి ప్రయత్నిస్తుంటారు. లేదా మట్టితో, ఇసుకతో బొమ్మలు చేస్తారు. అట్ట ముక్కలతో, అగ్గిపెట్టెలతో ఇల్లు, బస్సు, రైలు అని వాళ్ల ఊహలకు రూపం ఇస్తుంటారు. ఈ ప్రయత్నాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కూడా. పిల్లల్లో ఈ కోరిక ఎందుకు కలుగుతుంది? అదే వాళ్ల మెదడులోని సృజనాత్మకతకు తొలిమెట్టు. ఈ సృజనాత్మకతను ప్రోత్సహిస్తే, అది గొప్ప కళగా వికసిస్తుంది. "ప్రతి పిల్లాడూ ఒక కళాకారుడే. కానీ అసలు సమస్యల్లా, పెరిగి పెద్దయిన తర్వాత కూడా తనలోని ఆ కళాకారుడిని అలాగే ఎలా సజీవంగా ఉంచుకోవాలి అన్నదే." అంటాడు... పాబ్లో పికాసో, చిన్నపిల్లల్లో సహజమైన కల్పనాశక్తి, సృజనాత్మకత మెండుగా ఉంటాయి. ఇతరులు ఏమనుకుంటారనే భయం కానీ, నియమాల పట్టింపులు కానీ లేకుండా తమ మనసుకు తోచిన భావాలను చాలా స్వేచ్ఛగా, స్వచ్ఛంగా వ్యక్తం చేస్తారు. కానీ వయసు పెరిగే కొద్దీ సమాజం విధించే పరిమితులు, లౌకిక ప్రపంచపు ఆలోచనలు, బాధ్యతల వల్ల ఆ సహజమైన సృజనాత్మకత క్రమంగా మరుగునపడిపోతుంది. తార్కిక ఆలోచనలు పెరిగి, తమలోని ఆ అమాయకమైన కళాకారుడిని మర్చిపోతారు. కళను కచ్చితంగా ఒకే మాటలో నిర్వచించడం చాలా కష్టం. ప్రాచీన కాలం నుంచి పండితులు దీనికి ఒక స్పష్టమైన నిర్వచనం ఇవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రకారం సృష్టిలో 'నిలకడ (స్థితి), 'కదలిక (గతి' అని రెండు ఉంటాయి. కళ నాడు-నేడు