KALA SARITHSAGARAM by AYALASOMAYAJULA RAMA JOGARAO Telugu book cover

KALA SARITHSAGARAM

by AYALASOMAYAJULA RAMA JOGARAO

₹250
In stock · 56 available
PublisherAYALASOMAYAJULA RAMA JOGARAO
LanguageTelugu
మనసులో మాట ... ఏదో ఒక పుస్తకాన్ని వ్రాసేసి పాఠకుల ముఖాన్న పడేద్దామన్న ఆలోచనైతే నాకు లేదు. అలాగని పాఠకుల ముఖస్తుతి కోసం కూడా ఈ పుస్తకాన్ని వ్రాయలేదు. సాంస్కృతిక పాత్రికేయునిగా నాకున్న పరిమిత అనుభవంతో ఈ పుస్తకాన్ని వ్రాయాలనుకున్నాను. పుష్కరకాలం పాటు ఆంధ్రజ్యోతిలో సాంస్కృతిక పాత్రికేయునిగా సేవలందించి మహా విశాఖ నగరంలో అనేకానేక సాంస్కృతిక కార్యక్రమాలకు సాక్షినై ఈ పుస్తకాన్ని వ్రాయడాని కి సాహసించాను. పాత్రికేయునిగా నన్నాదరించిన ఆంధ్రజ్యోతికి ఎప్పుడూ ఋణపడుంటా 2. ఇక ఏ యుగంలో చూసుకున్నా, ఏ తరంలో చూసుకున్నా, భారతీయ కళలన్నీ అపు రూపమైనవేనన్న భావం నాది. నాకు తెలిసిన, చూసిన ఆయా కళల గురించి పుస్తక రూపంలో పాఠకులకు అందించాలనుకున్నాను. శాస్త్రీయ సంగీతం, సాహిత్యం, శాస్త్రీయ నృత్యాది జానపద, గిరిజన కళలు, లలిత కళలు, అలాగే పాశ్చాత్య కళలు, ఆయా వాయిద్యాల గురించి వ్రాయాలనుకుని ఈ పుస్తకాన్ని ప్రారంభించాను. ఈ పుస్తకానికి 'కళా సరిత్సాగరం' అన్న పేరు సమంజసంగా భావించాను. పాశ్చాత్య కళలను కూడా ఆద రిస్తున్నాం కనుక వాటిని కూడా 'మన కళలు'గా భావించి ఈ పుస్తకంలో చోటివ్వడం జరి గింది. దీంతో అక్కడక్కడ ఆంగ్ల పదాలు వ్రాయడం జరిగినందుకు పాఠకులు మన్నించ గలరని భావిస్తాను. ఈ పుస్తకాన్ని వ్రాస్తున్నాను కదా అని నన్ను అనుభవశాలిని అనుకో వద్దు. ఎందుకంటే నేనేమి శోధించి, పరిశోధించి, వ్రాయలేదు. తెలుసుకున్నవి, పలు పుస్త కాల్లో చదివింది పరిగ్రహించి వ్రాసానని గమనించాలి. అయితే ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలన్నది సందిగ్ధం. దీంతో జాప్యం అయ్యింది. సాంస్కృతిక కళా వైభవానికి చిరునామా అయిన మహా విశాఖలో శాస్త్రీయ, లలిత, జానపద, గిరిజన కళలన్నీ ఒకే చోట కొలువు తీరాయి. 'శత కళా వైభవం'. పేరిట 36 గంటల పాటు వివిధ సంగీత నృత్యాది కళలను ప్రదర్శింప చేసిన ఘనత 'విశాఖరత్న' సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు పి.ఎ. భాస్కర రావుగారికే దక్కుతుంది. శతకళా వైభవం కార్యక్రమాలలో కళాకారులు ప్రదర్శించిన ఆయాకళలను చూసిన తరువాత ఈ పుస్తకాన్ని ఎలాగ వ్రాయొచ్చో అర్థమైంది. అంతే కాకుండా ప్రదర్శితమైన కళలు, గురించి పుస్తక రూపంలో అందరికి అందించాలన్న సంకల్పం చేశారు భాస్కర రావుగారు. అందుకు నా సహాయం కోరడంతో పుస్తకాన్ని ప్రారంభించాను. పుస్తకాన్ని వెలుగులోనికి తేవాలన్న భాస్కర రావుగారి ఆశయం, ఆయన ఒక్కరి వల్ల సాధ్యం కాలేదు. ఎవ్వరూ చేయి కలప లేదు. ఆర్థిక, హార్దిక, సహాయసహకారాలు అందించకపోవడంతో అదికాస్తా ఆగిపోయింది. దీంతో నేనే ఈ 'కళా సరిత్సాగరం' పుస్తకాన్ని వ్రాయడానికి పూనుకున్నాను. అయితే భాస్కర రావుగారి శతకళా వైభవం కార్యక్రమాలు ఈ పుస్తకాన్ని వ్రాయడానికి దోహద పడ్డాయి కనుక, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.