
KALABANDATHO GRUHAVAIDYAM - 30
₹30
In stock · 4 available
PublisherSRI BALAJI PUBLICATIONS
LanguageTelugu
కలబందతో గృహ వైద్యం... అపర సంజీవిని 'కలబంద' మానవాళి సమస్తం నేడు అనేక రుగ్మతలతో రోధిస్తుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో పుట్టుకతోనే రోగాలతో మానవుడు జన్మిస్తున్నాడు. తినే తిండిలో పీల్చే గాలిలో త్రాగే నీటిలో ఇలా పంచ భూతాలు సైతం కాలుష్య కోరల్లో విషతుల్య మౌతుంది. ఆరోగ్య వంతుడైన మానవుడు కనుమరుగు అవుతున్నాడు. శాస్త్రజ్ఞులు వ్యాధులకు మెడిసిన్స్ కనిపెడు తున్నారే గాని ? అసలు వ్యాధులు రాకుండా ఎందుకు మెడిసిన్స్ కనిపెట్టలేక పోతున్నారో...? ఎవరికీ అంతు బట్టదు. ఇక అసలు విషయాని కొద్దాం ...! లక్షల, వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఆనందకరమైన సంపూర్ణ ఆరోగ్యంతో ఎంతో కాలం జీవించారు. ఆనాడు హైటెక్ హాస్పటల్స్, స్పెషలిస్టులు, ఆపరేషన్స్, మెడిసిన్స్ అవసరం లేకుండానే దైనందిన జీవితంలో ఆహార నియమాల ద్వారాను, ప్రకృతి పరమైన వనమూలికలు సేవించడం ద్వారా వ్యాధులనుండి రక్షణ పొంది, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వందల సంవత్సరాలు జీవించారు. ముఖ్యంగా మన పెరట్లో అందుబాటులో వుండే అనేక ఔషధ మొక్కల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. దీర్ఘ వ్యాధుల బారిన పడకుండా సహ జీవనం సాగించారు. ముఖ్యంగా వేప, తులసి, కలబంద వంటి ప్రకృతి సిద్ధమైన అపార ఔషధ గుణాలున్న వాటిని నిత్యము సేవించడం ద్వారా వారు ఆరోగ్యంగా దీర్ఘ ఆయుష్షుతో జీవించినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే నువ్వుల నూనె (పప్పునూనె) వాడటంవల్ల మానవుని శరీరంలో సమస్త ధాతువులు శుభ్రపరచబడి సంపూర్ణ ఆరోగ్యం సాధించారు మన పూర్వీకులు.