
KALAM GALAM
by DANDAYATRA ENTRPRISES PVT.LTD
₹99
In stock · 50 available
PublisherDANDAYATRA ENTRPRISES PVT.LTD
LanguageTelugu
ముందుమాట కవిత్వానికి ఇక కాలం చెల్లిందేమో అని అనుమానపడుతున్న రోజుల్లో లేదులేదని చెప్పటానికన్నట్టుగా వచ్చింది విపిన్ సూర్య కవితా సంకలనం. స్వర్గీయ నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఒక ఉదంతం చెప్పేవారు. ఆయన ఒక సారి ముషాయిరాలో పాల్గొనడానికి హైదరాబాద్లో నుమాయిష్ (ఇప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటున్నాం)కి రిక్షాలో వెళ్ళారట. సుమాయిష్ చేరుకుని రిక్షా దిగి రిక్షావాడికి డబ్బులిచ్చి కాస్తంత ముందుకు నడిచాక ఎందుకో వెనక్కి తిరిగి చూస్తే కనపడిన దృశ్యం ఆయన్ను దిగ్భ్రాంతికి లోను చేసిందట. ఆ రిక్షావాడు ఈయన సవారీ దింపి, రిక్షా సీటు పైకెత్తి, దాని కిందినుంచి ఒక షేర్వాణీ తీసి వేసుకుని ముషాయిరా వేపు నడక ప్రారంభించాడట. కవిత, షాయరీ లకు అంత జనాదరణ ఉండేదట ఆ రోజుల్లో. అంత పురాతన కాలం వరకూ వెనక్కి పోనక్కరలేదు.మా తరానికీ తెలిసు. ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం వరకూ కూడా కవిసమ్మేళనాలకీ ముషాయిరాలకీ జనం కిక్కిరిసేవారు. ఉగాది కవిసమ్మేళనం ఉదయంపూట రేడియోలో ప్రసారం అవుతూంటే పండగపూట కూడా ఇంటిపనులూ వంటపనులూ పక్కనపెట్టి ఆడా మగా రేడియో చుట్టూ చేరి శ్రీశ్రీ, దాశరధి, ఆరుద్ర, జ్ఞానానందకవి, వానమామలై వరదాచార్యులు మొదలైనవారి కవితాగానం ఆసక్తిగా వినేవారు. పద్యాలు, గేయకవితలూ కవులు భావయుక్తంగా గానం చేసేవారు. నా చిన్నప్పుడు మా ఊళ్ళో భువనవిజయం వేసి ఇప్పుడు వచ్చిన జనానికి మా కాలేజీ గ్రౌండు పట్టలేదు. చదువుతోటీ, ఆస్తి అంతస్తులతోటీ నిమిత్తం లేకుండా కవితాగాన రసాస్వాదన కొన్నేళ్ళ క్రితం కూడా జరిగేదంటే ఇవాళ నమ్మశక్యంగా అనిపించదు. కవులను పోషించే వాళ్ళెలాగూ లేరు. కనీసం వారు వ్రాసింది ఆస్వాదించి శెభాష్ బాగుంది అనేవాళ్ళు నూడా కరువయ్యారు ఈమధ్య. కైత సినిమా సన్నివేశాలలో చిక్కుకుపోయి బందీ అయిన రోజులివి.