
KALATHEETHA VYAKTULU
by DR.P.SRIDEVI
₹220
In stock · 405 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
'కాలాతీత వ్యక్తులు': ఒక ప్రసక్తి పి. సరళాదేవి • " 'కాలాతీత వ్యక్తులు' చ్చాలా బావుంది." అన్నాడు ఒకాయన గట్టిగా కళ్ళు మూసుకొని, పళ్లుకరుచుకొని "చాలా" ను నొక్కి. నొక్కి ఉచ్చరిస్తూ, సీరియల్ అంతా పూర్తయిపోయినతరువాత, ఒక్క సారిగాపుస్తకాలన్నీ పరుచుకు చదవొచ్చులే అనుకున్న నేను "బావుంది కాబోలు" అనుకున్నాను. తరువాత రెండుమూడు వూళ్ళు తిరిగాను. ఎక్కడ చూసినా ఈ "కాలతీత వ్యక్తులు" బావుంది బావుంది అనసాగారు. అప్పటికి పది, పన్నెండువారాలయివుంటుంది ఆ సీరియల్ మొదలు పెట్టి. ఈ "బావుంది" శబ్దం ఎక్కువగా వినిపించేసరికి నాకూ చదివేద్దామా? అనిపించింది. అప్పటికి వచ్చిన పన్నెండు పుస్తకాలూ దగ్గర పెట్టుకుని చదవడం మొదలు పెట్టాను. ఆ మొదలు పెట్టడం పన్నెండు పుస్తకాలూ ఒక్కిడత పూర్తిచేస్తేగాని లేవలేకపోయాను. పఠితనుపట్టి, లాగి ఈడ్చుకుపోయింది. నేను చదవలేదు. అదే నాచేత చదివించింది. ఇంతస్పీడుగా వస్తూవున్న బండి పన్నెండూ అయిపోయేసరికి నుంచుండిపోయి, రాబోయేవారాల కోసం ఆవురావురుమని ఎదురు చూడసాగింది. ఏదైనా చదువుతున్నప్పుడు, అందులోని మనుషుల్ని నిజంగా వున్నట్టుగా వూహించుకొని, ఆ వ్యక్తుల చర్యలను మాటలను, గమనించి, ఆ మాటలు నిజంగా మనుషులు మాట్లాడగలరా? అలా ప్రవర్తించగలరా? అని ప్రశ్నలు వేసుకుని "గలరు" అని జవాబొస్తే అది వాస్తవిక రచన అని అనుకోవడం కొందరి తత్వం. ఈ రకంగా చూస్తే ఈ నవలలోని ప్రతీ అంశానికీ "గలరు" అనే జవాబే వస్తుంది. సీరియల్ అంతా చదివేసి- "ఇందిరకు హేట్స్ఆఫ్" అన్నారు ఇంకొకరు. ఇందర ఒక గొప్ప సృష్టి, ఇంతవరకూ సృష్టించబడని ఒక గొప్ప వ్యక్తి. తన వ్యక్తిత్వాన్నే గొడుగుగా చేసుకొని గాలివానలకూ, వురుములూ మెరుపులకూ జడవకుండా నిర్భయంగా నడిచిపోయే బలమైన వ్యక్తి. "ఇందిర యిందాక నిన్ను సరిగా గమనించలేదేమోగాని, అమాంతం భుజం పట్టుకు నిలవేసి మరీ మాట్లాడేస్తుంది. అరనిముషం కిందట పరిచయమైన వాళ్ళతో ఆరుగంటలు బాతాఖానీ వేసుకు కూర్చోగలదు" అంటాడు ప్రకాశం. కృష్ణమూర్తికీ, పాఠకుడికీ ఒక్కసారే ఇందిరను పరిచయంచేసి. "ఒక రూమే ఏమిటి? అతనే నా కేరాఫ్ వున్నాడు" అని ఇందిర పదిరోజుల కిందట తెలిసిన ప్రకాశం గురించి చెప్పడంలోనే ఆ పరిచయం నిజమే అనిపిస్తుంది– కృష్ణమూర్తికీ పాఠకుడికీ కూడా