
KALLURU SUBBA RAO JEEVITHA GADHA
₹40
In stock · 442 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. ప్రవేశిక కొందరు వ్యక్తులు గొప్ప వాండ్లుగా జన్మిస్తారు. మరికొందరికి లోకం గొప్పతనం ఆపాదిస్తుంది. మరికొందరు తమంతట తామే గొప్ప వాండ్లవుతారు. కడపట చెప్పిన పద్ధతిన గొప్పవాడైన వ్యక్తి కల్లూరు సుబ్బారావు. ఎవని పుట్టుకతో వంశమంతటికి కీర్తి వస్తుందో అతని జన్మమే ధన్యమైనది. ఏ పూతచరితుని పుట్టుకతో ఒక ప్రదేశం పునీతమౌతుందో అదొక పుణ్యస్థలి. ఆ దృష్టితో చూస్తే ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల సరిహద్దున గల పట్టణం హిందూపురం. దాని సమీపాన గల కల్లూరు గ్రామం దేశారాధక యువకులకు పుణ్యతీర్థమయింది. ఈ ఊరి పేరు దేశం నలుమూలలా మారు మ్రోగిపోయింది. 19వ శతాబ్ది ప్రారంభదినాలలో పల్లె ప్రజలు కలసి మెలసి జీవించేవారు. ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకునే వారు కాదు. అప్పా, అక్కా బావా, మామా అనే మాటలతో చుట్టరికపు వరసలు సూచిస్తూ ఆదరంగా పలకరించుకునే వారు. కులాల ఊసులేదు. గ్రామంలో అందరిలో