KALPANA KAVITHA SAMPUTI by ANISHETTI SUBBARAO Telugu book cover

KALPANA KAVITHA SAMPUTI

by ANISHETTI SUBBARAO

₹100
In stock · 45 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
కవిత్వ సందర్భం అభ్యుదయ సాహిత్యపథంలోని గత ఉద్యమాల శతాబ్దపు 5వ దశకానికి ముందరి బలమైన కవితా పాదముద్రలీ "కల్పన". ప్రగతిశీల కవితోద్యమ మహాప్రస్థానంలో ఉడుకెత్తిన నవచేతనదళ మెత్తిన పతాక రెపరెపలీ "కల్పన". ఆగామికాలాన పురోగామి కవులకు దశా దిశల నందించాలన్న తపనతో దృఢమైన కవితా తాత్వికత భూమికగా ఉబికిన పునాది "కల్పన". గతంలో భావకవిత్వ ప్రాతినిధ్య కవితా సంకలనం ముద్దుకృష్ణ సంకలిత “వైతాళికులు" (1935). ఇది ఆధునిక కవి ప్రాతినిధ్య కవితా సంకలనం. అనిసెట్టి, అవసరాల, బెల్లంకొండ, రెంటాల సంయోజిత "కల్పన". చేతన సాహితి రూపకల్పన. అప్పటికి అభ్యుదయ తాత్వికతే ఆధునిక సాహిత్య తాత్వికత. అభ్యుదయ రచయితల సంఘంలోని వ్యక్తుల చేరికతో రూపం సంతరించుకున్న చేతన సాహితి, అరసంలోని ప్రముఖుల సంపాదకత్వాన ఈ సంకలనం వెలువరించింది. క్రమేణా సంస్థకు చెందిన వీరందరూ జీవన పోరాటంలో తలో రంగానికి వెళ్ళడంతో తర్వాత అరసంలో విలీనమైంది చేతన సాహితి. సాహిత్య పోరాట నేపథ్యంతో సాగిన ఈ "కల్పన” - తెలంగాణా సాయుధ పోరాట అమరవీరుల గాథల నిర్మాత, పోరాట గగనాన ఎర్రజెండాలను ఎగరేసిన అభ్యుదయ సాహిత్య సేనాని కామ్రేడ్ గంగినేని వెంకటేశ్వరరావు, గీతాదేవిగార్లకు సమర్పించిన చారిత్రక సంకలనం. ఉదయిని, ఎర్రజెండాలను విశాలాంధ్ర ప్రచురణాలయం పునర్ముద్రించిన సందర్భంలోనే కామ్రేడ్ గంగినేని దీని పునర్ముద్రణనూ ప్రస్తావించారు. 1953 లో చేతన సాహితి తరఫున విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన తొలి ప్రచురణకు ఇది మలి ప్రచురణ. ప్రస్తుతం దీనికి సహకరించిన కృతి స్వీకర్త, మాజీ ఎం.ఎల్.ఏ. శ్రీ గంగినేనికి, డాక్టర్ కడియాల రామ్మోహన్రాయ్, కె. ప్రతాపరెడ్డి ఇతర మిత్రులకూ విశాలాంధ్ర ప్రచురణాలయం కృతజ్ఞతలు. అలాగే నేటితరం కవులతో మమేకమైన నాటి చేతన సాహితి అనుయాయీ, ప్రముఖ కవీ శ్రీ సి.వి. కృష్ణారావుగారు - అనారోగ్యంగా వున్నా - ఈ ప్రచురణ కోసం ముందుమాట రాసినందుకు ధన్యవాదాలు. చిరకాలం నుండీ ఎదురుచూస్తున్న పాఠకులకందిస్తున్న అపురూప కానుకే ఈ “కల్పన”. స్వీకరించండి... ప్రకాశకులు