KALTHI AAHARAM MANAVALI MANUGADA by MUPPALA NAGESWARA RAO Telugu book cover

KALTHI AAHARAM MANAVALI MANUGADA

by MUPPALA NAGESWARA RAO

₹20
In stock · 981 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ముప్పాళ్ళ నాగేశ్వరరావు సమన్వయ కర్త : సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ ముందుమాట ఆహార వినియోగం లేనిదే జీవన మనుగడ కల్ల! ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు కొలువై ఉంటుంది. ఆదిలో మానవాళి మనుగడ ప్రకృతి సిద్ధమైన ఆహారంతో మొదలయినప్పటికీ ప్రస్తుతం వండి వార్చిన పదార్థాలను భుజించడం మొదలుపెట్టాము. సాగుభూమి, జనాభాకు పొంతన లేకపోవడం, రైతు వృత్తిలో క్షీణత, పారిశ్రామికీకరణం, లాభాపేక్ష అన్నీ కలసి మనం తీసుకునే ఆహారంలో కల్తీని ప్రమాదకర స్థాయిలోనికి పెంచుతున్నాయి. ఈ విషతుల్య ఆహారం, అధిక మొత్తంలో ఆహార స్వీకరణ వెరసి, శారీరక శ్రమ లేకపోవడం వలన శరీరంలోని ప్రతి అవయవం తీవ్ర అస్వస్థకు గురి అవుతుంది. మరీ ముఖ్యంగా జీర్ణవ్యవస్థ. 30 అడుగులు అంటే సుమారుగ 5 1/2 మనుషుల పొడవు పరిమాణంలో ఉన్న జీర్ణవ్యవస్థ ఈ కల్తీల అరుగుదలలో అవస్థలు పడుతోంది. దీనివలన ఉదర, జీర్ణకోశ, గుండె, కాలేయం, మూత్రపిండాలు, చక్కెర వ్యాధులు తీవ్రస్థాయిలో చిన్న వయసు వారిలో కూడా ప్రబలడం చూస్తున్నాము. గుర్తించలేని స్థాయిలో, అదుపు చెయ్యలేని స్థితిలో ఈ ప్రమాదకరమైన కల్తీ ఆహారం జాడ ప్రతి ఇంటి వంటగదిలో కొలువై ఉంది. జీవించే హక్కు, ఆరోగ్య హక్కులకు తీవ్ర సవాలును విసరుతున్న ఈ కల్తీలపై ప్రభుత్వం, మేధావుల స్పందన దిగ్భ్రాంతికరంగా మంద స్థాయిలో ఉంది. కంచె చేను మేసిన చందంగా.... జీవన పోకడలు, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి వలన కుంటు పడుతున్న ఆరోగ్యాన్ని ఈ కల్తీలు ఉదృతం చేయడమే కాక హార్మోన్స్ సమతుల్యతను దెబ్బతీయడం వలన థైరాయిడ్ లాంటి వ్యాధులకు గురి అవుతున్నారు. మంచి పొట్టలో మంచి