
KALYANA MANJEERALU
₹120
In stock · 559 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
KALYANA MANJEERALU by Amruthlal Naagar అమృత్లాల్ నాగర్ హిందీ సాహిత్యంలో సుప్రసిద్ధ నవలా రచయిత అమృత్ లాల్ నాగర్కు ఒక విశిష్టమైన స్థానమున్నది. మౌలికమైన ప్రతిభాసంపన్నుడిగా నాగర్ తమ నవలల్లో అనుభూతి ప్రధానమైన వాతావరణాన్ని అల్లుతారు. పాత్రల మానసిక అగాధాల్లోకి చొచ్చుకపోతారు. వ్యంగ్య ప్రధానమైన శైలిలో దేశకాల పరిస్థితులకు అద్దం పడతారు. అలాగే వస్తుపరంగా ఇతివృత్తాన్ని అనుసరించి తమ శైలీ సంవిధానాన్ని రూపొందించు కుంటారు. నాగర్ సమకాలీన సమస్యలను, సామాజికపరమైన ఇతివృత్తాలను తీసుకొని సజీవమైన హిందీ నవలలు రచించారు. వారు రచించిన నవలల్లో బాగా పేరు తెచ్చుకున్నవి - నవాబీ మసనద్, మహాకాల్, బూంద్ ఔర్ సముద్ర, నాచ్యో బహుత్ గోపాల్, మానస్ కాహన్స్ మొదలైనవి. ఈ నవలల్లో మధ్య తరగతి, బడుగు జీవితాల గురించి ఆయన శక్తివంతంగా చిత్రించారు. పల్లె జీవితాల గురించి కూడా నాగర్ రచనలు చేసారు. భారతీయ సంస్కృతికి వున్న మౌలిక పునాదులను ఆయన విస్మరించలేదు. కళ్యాణ మంజీరాలు (సుహాగ్ కే నూపుర్) అనే ఈ నవలను అమృత్లాల్ నాగర్, తమిళ కావ్యం 'శిలప్పదికారం' ఆధారం చేసుకొని రాసారు. తమిళనాడులోని పేర్లు, సంఘటనలు వీటిలో కనపడతాయి. జైన బౌద్ధ మతాల ప్రభావం వున్న రోజుల్లో సాంఘిక పరిణామాలు, ఆచార వ్యవహారాలను ఈ నవల ప్రతిబింబిస్తున్నది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004