
KAMKANTI PAPARAJU - UTTARA RAMAYANAMU -3
₹300
In stock · 18 available
PublisherBETHAVOLU RAMABRAHMAM
LanguageTelugu
ISBN9781682441787
కంకంటి పాపరాజు తరరామాయణము సప్తమాశ్వాసము కం. శ్రీ లలితమిత్రవిందా బాలామృదులోరు నిహిత పదపంకజ! భద్రా లోలలోచనా కచ కీలిత నవహేమదామ! కితవ విరామా! 01 అన్వయం, వ్యాఖ్య : శ్రీ లలిత = శోభాసంపన్నమైన, మిత్రవిందా బాలా = మిత్రవింద అనే బాలామణి యొక్క మృదుల + ఊరు = మృదువైన తొడమీద, నిహిత = ఉంచబడిన, పదపంకజ = హస్తపద్మం కలవాడా! భద్రా = భద్ర అనే; లోలలోచనా = చంచలాక్షి యొక్క కచ = క్రొమ్ముడితో, కీలిత = అలంకరించిన, నవ - హేమదామ = కొత్త సంపెంగ దండ కలవాడా! కితవ విరామా వంచకుడిగా విభాసించేవాడా విరాజిల్లేవాడా! తే.గీ. అవధరింపుము, రామచంద్రావనీంద్ర వర్యుఁ డీ రీతి నవ్విభావరిఁ గ్రమించి కల్యమున లేచి సంధ్యాదికములు దీర్చి కొలువు సింగారమై సభాస్థలికిఁబోయి 02 అన్వయం, వ్యాఖ్య : మదనగోపాలా! ఆలకించు. రామచంద్ర మహారాజు (అవనీంద్రవర్యుడు) ఈ రీతిగా ఆ రేయి (విభావరిన్) గడిపి (క్రమించి), ప్రాతఃకాలంలో (కల్యమున) లేచి, సంధ్యావందనాదికాలు నిర్వహించి, రాజసభకు ఉచితమైన అలంకరణ (కొలువు సింగారము) చేసుకొని, సభాస్థలికి వెళ్ళాడు. 5. భరతాది సోదరుల్ ప్రణతులై యట నిల్చి కనుసన్నఁ బనిచిన పను లొనర్పఁ బ్రేమ మీఱ వసిష్ఠ వామదేవాదికుల్ మొనసి యాశీర్వాదములు ఘటింప