KANCHANA - DHIVI NUNDI BHUVIKI DIGINA DEVA KANYA by YAITLA KISHORE KUMAR Telugu book cover

KANCHANA - DHIVI NUNDI BHUVIKI DIGINA DEVA KANYA

by YAITLA KISHORE KUMAR

₹200
In stock · 100 available
PublisherYAITLA KISHORE KUMAR
LanguageTelugu
ముందుమాట సృష్టికర్త తన శిల్పకళాచాతుర్యమంతా రంగరించి మలచిన సువర్ణ శిల్పం, రాగజగతికె రక్తిని పిలిచే రసమయ రూపం, అంగాంగాన శృంగారాన్ని సింగారించి రూపుదిద్దిన మధుమయ శిల్పం, వెండితెర కాన్వాస్ పై బంగారు కుంచెతో రవివర్మ చిత్రించిన రసమయ రూపం, కళ్ళతోనే కోటి భావాలు పలికించి, పలుకులతో నయగారాల నవరత్నాలను వెదజల్లిన అభినయ ధురీణ, కరకు గర్జనల మేఘముల మధ్య అవతరించిన మెరుపుతీగ, ఆంధ్ర చిత్రరంగాన్ని తన అభినయ సౌరభంతో కొత్త రంగులద్దటానికి "దివి నుండి భువికి దిగిన దేవకన్య", అద్భుత అభినయలోచన నటీమణి కాంచన. అందం, అభినయం, సౌకుమార్యం, నృత్యం అన్నీ కలిసి శృంగారమైన, విషాదమైన, ప్రేమ భావమైన, అభిజాత్యమైన అద్భుత అభినయంతో అలరించి మురిపించిన నటీమణి కళాజ్యోతి కాంచన గారు. ఎంతటి సౌందర్య మూర్తో, అంతటి కారుణ్యమూర్తి, సరస శృంగార నయగారాలతో అలరించిన ఆమె అంతరంగం ఆధ్యాత్మిక సౌధానికి ఆలవాలం, మానస సరోవరంలో అవతరించిన శతపత్ర కమలం, రతిదేవి అందాన్నే ధిక్కరించిన అతిలోక సౌందర్యం, నేడు జీవిత సాఫల్యాన్ని అందుకునే దిశగా ఆధ్యాత్మిక బాటలో అడుగులు వేస్తున్నారు, జీవిత పరమార్ధాన్ని తెలుసుకొని పరిపూర్ణత్వంతో సాగుతున్న ఆ కళామూర్తి అభినయ చిత్రాలను గుర్తు చేసుకుంటూ ఆ సృష్టికర్త ఆంధ్ర కళారంగాన్ని రంజింప చేయడానికి పంపిన చంద్రదీపం, అభినయ సౌందర్యలహరి కాంచన గారి చిత్రరంగ హరివిల్లు నేటితరానికి చూపించడానికి చేస్తున్న ఈ చిరు ప్రయత్నమే దివి నుండి భువికి దిగిన దేవకన్య (నటీమణి కాంచన గారి చిత్రకథ)