KANNAVI VINNAVI by G.KRISHNA Telugu book cover

KANNAVI VINNAVI

by G.KRISHNA

₹200
In stock · 8 available
PublisherVETERAN JOURNALIST ASSOCIATION
LanguageTelugu
మా మాట పాతతరం జర్నలిస్టులలో అత్యంత ఆధునికుడు, అందరితో ఏ తరం వారితోనైనా సరే కలిపోయి హాయిగా, ఆత్మీయంగా, చమత్కారంగా మాట్లాడగలిగిన మహావిజ్ఞాని జి. కృష్ణగారు. తెలుగులో, ఇంగ్లీషులో తాను మాట్లాడే పద్ధతిలోనే అదీ ఇదీ అని కాకుండా ఏ రంగం గురించైనా, రసరమ్యంగా, రాసులుగా రాసినవారాయన. వారు జీవించిన కాలంలో అంటే రెండు దశాబ్దాల క్రితమే వారు వ్రాసిన "కన్నవీ-విన్నవీ" కాలమ్ నుంచీ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైన మరికొన్ని 'కన్నవీ -విన్నవీ', మిత్రులు ఉడయవర్లుగారు సేకరించి 'కన్నవి- విన్నవీ" గ్రంథంగా ప్రచురించాలని ప్రయత్నించారు. దానికి స్వయంగా కృష్ణగారే 'ఈ వ్రాతలకు ఆధారం' అనే ఒక ముందుమాట వ్రాసిచ్చారు. కాని కారణాంతరాల వల్ల ఆ గ్రంథ ప్రచురణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ, నేటికి అది వెలుగులోకి తెచ్చే అవకాశం మా వయోధిక పాత్రికేయ సంఘానికి లభించినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాము. మేము ప్రచురించ సంకల్పించిన ఈ గ్రంథానికి డా|| పి.యస్. గోపాలకృష్ణగారు. "మరపురాని మహనీయులు- జి. కృష్ణ" అనే ఆత్మీయస్పర్శగల వ్యాసాన్ని వ్రాసిచ్చారు. వారికి మా కృతజ్ఞతలు, నిరాడంబరంగా జీవితం సాగించి, జీవించినంతకాలం జనరంజకమైన రచనలు చేసిన జి. కృష్ణపట్ల అపారమైన ఆరాధనాభావము గల ప్రముఖ చిత్రకారుడు, చంద్రగారు చూడచక్కని ముఖచిత్రం గీసిచ్చారు. వారు ఇటీవల కన్నుమూశారు. ఈ ప్రచురణ వెలుగులోకి రావడం ద్వారా వారి ఆత్మకు శాంతి కలుగుతుందని ఆశిద్దాము. ఈ గ్రంథం ప్రచురణలో అక్షరదోషాలు రాకుండా దిద్దిన సీనియర్ జర్నలిస్టు శ్రీమతి కె.బి. లక్ష్మిగారు కూడా ఈరోజు మన మధ్యలేరు. ఈ గ్రంథానికి అక్షరకూర్పు చేసినవారు ఎల్. రామకృష్ణ, శ్రీమతి దామరాజు నాగలక్ష్మి గారు, గ్రంథం అందంగా ముద్రించినవారు 'రైతునేస్తం' సంపాదకులు, పద్మ అవార్డు గ్రహీత వై.వి.రావు గారు. వీరందరికీ కృతజ్ఞతలు.