
KANNETI CHEVRALU
₹80
In stock · 282 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
KANNITI CHEVRALU by M.R. Aruna Kumari 'కన్నీటి చేవ్రాలు' ఆద్యంతం ఆర్ద్రమైన రచన. ఈ నవలిక కథా కాన్వస్ను నిర్ణయించుకుని 'స్క్రీన్ ప్లే' ప్రణాళిక సిద్ధం చేసుకుని తన వృత్తి రంగ సేవానికషోఫలంగా వేలార్చిన రచన. అద్దంలో ఒక గురువు జీవితాన్ని దర్శింప చేసి గురు శిష్య సంబంధం, అనుబంధం, ఆత్మీయ ఋణాను బంధాన్ని గుర్తు చేస్తుంది. జీవితంలో చరమ దశలో వ్యక్తిగతమైన ఒడిదుడుకులోనైన జీవితాన్ని, అది మిగిల్చిన అసంతృప్తి, విషాదాన్ని తలుచుకుంటూనే వృత్తి జీవితం మిగిల్చిన సంతృప్తితో, తోటి ఉపాధ్యాయుని స్నేహ వీచికలతో సేదదీరుతూ కాలక్షేపం చేస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుని జీవితంలో ఒక వారం రోజులు అతి విశిష్టంగా నడిచిన క్రమాన్ని చెబుతుంది ఈ నవల. దీన్ని అత్యంత నైపుణ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు భగవద్గీతలా తప్పక చదవవలసిన, సొంత గ్రంథాలయంలో ఉండవలసిన రచనగా తీర్చిదిద్దారు రచయిత్రి.