
KANNITI KASMIRLO OKA AMMA
₹175
In stock · 3 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076329
"రాత్రి అలసిపోయింది చీకటి ఆకాశంలో వేలాడుతున్న వృద్ధ చంద్రుడూ అలసిపోయాడు” అది 1990 ల కాలం. కశ్మీర్లో సాగుతున్న సుదీర్ఘ యుద్ధం ఆ సమాజం నుంచి బలికోరడం ప్రారంభమైన దశ అది. దాని తొలి బాధితులలో మన కథానాయిక హలీమా తండ్రి గులామ్ రసూల్ జూ, కొడుకు ఇమ్రాన్ ఉన్నారు. కౌమారప్రాయంలో ఉన్న ఆ పిల్లాడిని రాజ్యమేలుతున్న వాళ్ళు లాక్కునిపోతే ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. సమాజం నుంచి 'శూన్యం'లోకి నెట్టబడ్డ సమూహంలో ఒకడయ్యాడు. ఇది ఒక తల్లి కథ. కొడుకు బతికున్నాడో లేడో తెలియని అనిశ్చితితో, ఒంటరితనంతో నలిగిపోతూ సంవత్సరాల తరబడి బతుకునీడ్చిన ఒక మహిళ కథ. కొడుకు జాడ కోసం చిత్రహింసల శిబిరాలలో, కారాగారాలలో, మార్చురీలలో వెతుకులాడిన ఒక తల్లి జీవితం. ఒకప్పటి కూతురు కథ. అనాథగా మారిన ఒక అర్థతల్లి కథ కూడా. ఇంకా చెప్పాలంటే రాబోయే అనేకసంవత్సరాల పాటు తమను వెంటాడే యుద్ధంలో దగ్ధమవుతున్న కశ్మీర్ కథ ఇది. మనసును కుదిపేసే, కల్లోలపరిచే ఈ కథను అత్యంత సున్నితంగా, చిక్కటి కథనంతో మనముందుంచారు రచయిత షర్నాజ్ బషీర్. కశ్మీర్ నుంచి వినవస్తున్న శక్తిమంతమైన, కొత్తగొంతులకు సంకేతమీ కథ.