KANUVIPPU - 50 by SHIV KUMAR Telugu book cover

KANUVIPPU - 50

by SHIV KUMAR

₹50
In stock · 9 available
PublisherSHIV KUMAR
LanguageTelugu
ఆవు - దూడ రాఘవపురంలో నారయ్య, పేరయ్యలవి ఇరుగు పొరుగు ఇళ్ళు. వాళ్ళ పొలాలు కూడా పక్క పక్కనే ఉన్నాయి. వారి ఇళ్ళకు ఒక్కటే ప్రహరీ గోడ. ఇళ్ళ మధ్య అడ్డుగోడ లేదు. నారయ్య భార్యకాంతమ్మకు, పేరయ్య భార్య శాంతమ్మకు దైవభక్తి ఎక్కువ. కాడి ఎద్దులూ, రెండేసి గేదెలూ ఉన్నా, రెండు కుటుంబాలకు ఆవులు లేవు. భార్యల కోరిక మీద నారయ్య, పేరయ్య పశువుల సంతకు వెళ్ళి చెరొక ఆవును కొన్నారు. గోపూజకు అవకాశం ఏర్పడినందుకు కాంతమ్మ, శాంతమ్మ చాలా సంతోషించారు. ఆవులను శ్రద్ధగా పెంచసాగారు. నారయ్య ఆవు వరసగా రెండుసార్లు కోడెదూడను ఈనింది. పేరయ్య ఆవు రెండు సార్లూ పెయ్యదూడను ఈనింది. కోడెదూడ అయితే, పొలం పనికి ఉపయోగపడుతుందని పేరయ్య ఆశ. రెండు ఆవులూ మూడో సారి చూడితో ఉన్నాయి. ఈసారైనా తన ఆవు కోడెదూడను పెట్టాలని పేరయ్య ఆశతో కోరుకుంటున్నాడు. రెండు ఆవులూ ఈనడానికి సిద్ధంగా ఉన్నాయి. బంధువుల ఇంట్లో పెళ్ళికోసం నారయ్య కుటుంబం వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. మరునాడే వచ్చేస్తామనీ, తన ఆవును జాగ్రత్తగా చూస్తూఉండమనీ పేరయ్యతో చెప్పి, నారయ్య కుటుంబంతోసహా పొరుగూరు వెళ్ళాడు.