
KARL MARX JEEVITHA SANGRAHAM
₹120
In stock · 419 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126085
KARL MARX - A Short Biography - by Nikolai Ivanov కార్ల్ మార్క్స్ జీవితమూ, కృషిలోని ప్రధాన ఘట్టాల సంగ్రహ వర్ణన ఇది. ఒక పనిని దాని కర్త నుండి విడదీయడం ఎలా అసాధ్యమో, అదే విధంగా మార్క్సిజాన్ని మార్క్స్ నుండి వేరుపరచడం అసాధ్యం. అందుచేత మార్క్స్, ఒక మానవుడుగా, జిజ్ఞాసువైన యువకుడుగా, దారిద్ర్యంతోనూ, లేమితోనూ బాధపడుతూ, అంతులేని జ్ఞానతృష్ణతో ముందుకు సాగిపోయిన వ్యక్తిగా, ఒక పెద్ద కుటుంబానికి శ్రద్ధాళువయిన అధిపతిగా, కార్మికవర్గ దేశికుడుగా, దాని పార్టీ నిర్మాతగా, శాస్త్రరంగంలో విప్లవకారుడు, విప్లవంలో శాస్త్రకారుడుగా, నిజమైన దేశభక్తుడు, దీక్షాపరుడైన శ్రామికవర్గ అంతర్జాతీయతావాదిగా చూపేందుకు రచయిత కృషి చేశారు. మార్క్స్ దృష్టి భవిష్యత్తులోకి ఎంత దూరం చొచ్చుకుపోయిందో, గొప్ప గొప్ప సామాజిక ఉప్పెనలు వస్తున్న మన యుగంలో, మునుపటికన్నా మరింత స్పష్టంగా విదితమౌతుంది. మానవజాతి యొక్క ఈ అద్భుతమైన ప్రతినిధి జీవితమూ, కార్యకలాపాలను గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనే ఆసక్తిని గనుక ఈ చిన్ని పుస్తకం పాఠకునిలో రేకెత్తించినట్లయితే, మార్క్సిజం అంటే ఏమిటో తెలుసుకునే సరియైన మార్గంలో అతడు ప్రవేశిస్తాడు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN:978-93-48126-08-5