
KARL MARX PETTUBADI 3 - 300.00
by KARL MARX
₹300
In stock · 275 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సంపాదకుని ముందుమాట కార్ల్ మార్క్స్ “పెట్టుబడి" అంతగా యీ సహస్రాబ్దిలో మానవ జీవితాన్ని ప్రభావితం చేసిన గ్రంథం మరొకటి లేదు. యావత్ ప్రపంచ మేధావి వర్గ ఆలోచనా విధానాన్నే మార్క్స్ ప్రతిపాదించిన దార్శినికత మార్చివేసింది. జీవిత సరళినే మలుపు తిప్పింది. జన్మం, చర్మం, వెనకటి సంప్రదాయమూ నెరపే | అసమానతలకు చారిత్రక కారణాలను అన్వేషించి పరిష్కార మార్గాన్ని చూపెట్టింది. కల్పనల్లో ఊహల్లో, జానపద గాధల్లో కమనీయంగా కలలుగన్న స్వర్గాన్ని యావత్ సమాజ సమానత్వాన్ని వాస్తవం చేసే సిద్ధాంతమైన- శాస్త్రీయ సోషలిజాన్ని ప్రతిపాదించింది. దీనికి ఆచరణ యోగ్యత కలిగిందీ యిరవయ్యవ | శతాబ్దంలోనే. లెనిన్ నాయకత్వం క్రింద రాజకీయ అధికారాన్ని అందుకోవడం ద్వారా రష్యాలో మార్క్స్ సిద్ధాంతం ఒట్టి సిద్ధాంతంగానే కాక, యదార్థం అయే పరిస్థితి ఏర్పడింది. ఏడు దశాబ్దాలపాటు ప్రపంచ జనాభా యీ ప్రయోగాన్ని చూసింది. చరిత్ర గతిలో ఒడిదుడుకులు రావడం సహజం. సోవియట్ సోషలిస్ట్ రాజ్యం ఆచరణలో వెనకడుగు వేయాల్సి వచ్చింది. సామాజిక అభివృద్ధి గురించి "మార్క్స్ చేసిన స్థూల వివరణ పేర్లు పెట్టడానికి లేనివిధంగా సవ్యమైందే. అయితే ఈ దరిమిలా ఎన్నో మార్పులు వచ్చాయి." అని నెహ్రూ రాశారు. సోవియట్ ప్రయోగ విజయాలు, వైఫల్యాలు మాత్రమే మార్క్సిస్ట్ దార్శనికత సమంజసత్వాన్ని ఉపయోగాన్ని నిర్ణయించలేవని కూడా ఆయన రాశారు. అంచేత ఆచరణలో ఒకటి రెండు దెబ్బలు తినవలసి వచ్చినా మార్క్సిజం ఒక సిద్ధాంతంగా తన ప్రభావాన్ని కోల్పోలేదు. అంతేకాదు ప్రస్తుత సామాజిక వైరుధ్యాల నేపథ్యంలో యీ ప్రపంచ పరిశీలనా దార్శనికతకు విలువ హెచ్చింది. అని కూడా చెప్పాలి. మార్క్సిజం పతాకం క్రింద అధికారం దక్కించుకున్నా, ఆచరణలో అవరోధాలని అధిగమించ లేకపోవడంతోబాటు సిద్ధాంతాన్ని నవనవోన్మేషంగా కాలానుగుణమైన రీతిలో వికసింప చేసే ప్రయత్నమూ జరుగలేదు. సిద్ధాంతం సృజనాత్మకంగా ఆచరణలో అమలు జరుగుతూ వుండాలి. లేని పక్షంలో కొడిగట్టిపోతుంది. మార్క్సిస్టు సిద్ధాంతం పిడివాదం కాదు. గమనశీలమైన పరిస్థితుల్ని వాటిగతి క్రమంలో అధ్యయనం చెయ్యడం దీని పునాది. సమస్యలకు పరిష్కారాన్ని ఆ వెలుతుర్లో వెతకడం దీనికి ఆయువు పట్టు, మనకాలం నాటి సమస్యలకు పరిష్కారాన్ని అందించలేని దార్శనికత వట్టి ఊకలాంటిది. సూక్తుల్లా వర్ణించుకోవడానికి మాత్రమే మార్క్సిజం అలాంటిది కాదు, మార్క్స్ చేసిన చేసి మౌలిక సూత్రీకరణలకు అందుకే యివాళ కూడా మార్క్సిస్టు సిద్ధాంతం సామాజిక అవగాహనా అది పరిమితం అయిపోతుంది. ప్రత్యాఖ్యాతం కలుగలేదు. కరదీపికగా వుంది. అలాంటి మానవ పురోగమన మార్గాలు తెరిచిన యీ సిద్ధాంతానికి మకుటాయమానమైన కృతి పెట్టుబడి. మార్క్స్ జీవితమంతా ధారపోసి యీ రచనను అందించాడు. ఇంతటి ఉద్గ్రంధానికి మార్క్స్ చేసిన రెండు ఆవిష్కరణలు భూమిక అని చెప్పాలి. చారిత్రక గతి | తార్కిక భౌతిక వాదం, అదనపు విలువ ఉత్పత్తి అనేవి ఆ ఆవిష్కరణలు. సమాజం యిలా ఎందుకు ఉంది అన్న ప్రశ్నకు అనేకమంది మత బోధకులు, తత్త్వవేత్తలు తలా ఒక తీరులోనూ సమాధానాలు | చెప్పారు. కాని రోగ నిర్ధారణ సరిగా చెయ్యలేని వైద్యుడు చికిత్సలో విఫలమైనట్లే యే ఒక్క సమాధానమూ