KARMA - TELUGU by SADGURU book cover

KARMA - TELUGU

by SADGURU

₹199
Currently out of stock
PublisherJAICO PUBLISHING HOUSE
LanguageTelugu
'కర్మ' అని మనం తరచూ వాడే పదం, మన జీవితాలలో మనం చేసే మంచి చెడులు లేదా మనం చేసే ఆలోచనల పర్యవసానాలను బేరీజు వేసుకునేందుకు వాడే పదంగా మనం అర్థం చేసుకుంటాం. ఇది ఏ వ్యక్తి అయినా చివరకు తనకు తగినదే తాను పొందుతాడని చెప్పే సిద్ధాంతం. ఎంతో అలవోకగా వాడే ఈ పదం మన జీవితాల్లో ఎన్నో చిక్కులు తీసుకు వచ్చింది, అంతే కాకుండా సంతోషంగా జీవించేందుకు కావలసిన మూలాలను మన జీవితాల నుంచి తొలగించేసింది. ఈ పుస్తకం ద్వారా, సద్గురు అసలు కర్మ అంటే ఏమిటో వివరించడమే కాకుండా మన జీవితాలను సుసంపన్నం చేసుకునేందుకు ఆ కర్మ సిద్ధాంతాలను ఎలా ఉపయోగించుకోవచ్చో వివరిస్తారు. ఈ సూత్రాలను వివరిస్తూ, ఈ పోటీ ప్రపంచంలో మనం ముందుకు సాగేందుకు వీలుగా, ఆయన ప్రతి అడుగులో మనకు మార్గదర్శనం చేస్తారు. ఈ ప్రక్రియలో మనకు మన జీవితాలను అర్థం చేసుకుని మన విధిని తీర్చిదిద్దుకునేందుకు కావలసిన లోతైన, సంపన్నమైన అవగాహన చేకూరుతుంది. "ఈ కర్మ పుస్తకం ద్వారా, సద్గురు మానవుని ఉనికికి సంబంధించిన పరిమితులు, అవకాశాలు శోధిస్తారు. మీరు శ్రేయస్కరమైన, ఫలవంతమైన జీవితాన్ని జీవించేందుకు ఈ పుస్తకం నిండా ఎన్నో విలువైన సూచనలు ఉన్నాయి."- విల్ స్మిత్, హాలీవుడ్ నటులు "కర్మను గురించి మీకు తెలుసు అనుకున్నదంతా మర్చిపోండి. మీ చెడు ప్రవర్తనకు కర్మ అనేది ఒక శిక్షలాంటిది కాదు, ఇది మీ పరిణితికి, సాధికారతకు ఒక ఉపకరణం, ఈ పుస్తకం మళ్లీ మీ జీవితాన్ని మీరే నడుపుకునేలా చేస్తుంది." టామ్ బ్రాడీ మరిన్ని సద్గురు పుస్తకాల కోసం, సందర్శించండి: